పుట:SamskrutaNayamulu.pdf/228

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
211

సంస్కృతన్యాయములు

కలంజన్యాయము

కలంజము అనగావిషలిప్తబాణముచే జంపబడిమృగమాంసము అని అర్ధము.

"న కలంజం భక్షయితవ్యం న లశునం నగృంజనం చ" కలంజము, ఉల్లిపాయ మున్నగువానిని తినగూడదు అని విధివాక్యము. ఇందు కొలదిభేరమును సాధించిమీమాంశాశాస్త్రజ్ఞలు "అభక్షణం కర్తవ్యం" అభక్షణము చేయవలయును అనియా లేక "భక్షణం నకర్తవ్యమ్" భక్షింపరాదనియా అని పూర్వపక్ష మొనరింప "నభక్షణం కర్తవ్య్హం" అని సిద్ధాంతీకరింపబడినది. ఈషదంతరముచే ద్వివిధముగ శంకింపబడి యొకరమున సిద్ధాంతీకరింపబడునెడ నీన్యాయము ప్రవర్తించును.

కాంస్యబోజిన్యాయము

"నేననుదినము గురువుగారు భుజించగా మిగిలినిదానిని భుజింపవలెను; అందును కంచుకంచములో" అను నియమము గల శిష్యుని గూర్చి విచించిన, నాతనిగురుగు కంచుకంచములో భుజించుచున్నాడు అని తెలియుచున్నదిగదా! "పాత్రలో భుజించగూడదు; అందును కంచుపాత్రలో అసలే నిషిద్ధము" అనునియమము గల గురువునొద్ద కాంస్యబోజి శిష్యు డెట్లు మనగలడు?

గురునియమమును పాటించిన శిష్యనియమమునకును, శిష్యనియమము పాటించిన గురినియమమునకును భంగము వాటిల్లును. కావున---