పుట:SamskrutaNayamulu.pdf/225

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
208

సంస్కృతన్యాయములు

కేవలబహువచనాంతత్వమున అద్యర్ధమును బోధించునెడ నీన్యాయప్రవృత్తి/

కదంబకోరకన్యాయము

గుండ్రనికడిమిచెట్టు (పూవు) నకు చుట్టు నొకేమాఱుమొగ్గలు పుట్టును. ఒక్కమాఱుగ నన్నితావుల ప్రసారముగలయెడ నీన్యాయముపయోగింపబడును.

కదళీఫలన్యాయము

అరటిచెట్టు గెలవేసి పండ్లు పండినవెనువెంటన కొట్టివేయబడును.

ఆశ్వతరీగర్భ, వృశ్చికీగర్భ న్యాయములను జూడుము.

కనకకుండలన్యాయము

బంగారమువలన కుండలములు తయారగుచున్నవి. కుండలములు చెడిపోయిన బంగారమే అగును. ఆదిమధ్యావసానములయందు బంగారమునకును, కుండలములకును రూపమాత్రమే కాని వేఱొండు భేదము లేదు.

ఉదా:--బ్రహ్మము, తత్సృష్టప్రపంచము.

కపింజలన్యాయము

"కపింజలా నాలభేత" తిత్తిరిపక్షులను విశసింపవలెను అని సూత్రము. అనుచో సూత్రమున నిన్నిపక్షులను అని నిర్ధారణ లేనందువలన ఎన్నిపక్షులను అను శంక రాగా