పుట:SamskrutaNayamulu.pdf/224

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
207

సంస్కృతన్యాయములు

"......యస్మి న్నోతప్రోత మిదం జగత్" భాగవరము

ఔపాధికాకాశభేదన్యాయము

ఆకాశపరిచ్చిన్నన్యాయమును జూడు;ము.

కంఠచామీకరన్యాయము

బంగారుగొలుసును కంఠములో వైచికొని మఱచి "అయ్యో! నాగొలుసు పోయినది" అనిఏడ్చుచు వదకుకొనువాడు--అదిగో, నీగొలుసు నీమెడయందే ఉన్నది--అని ఒరులు చూపిన చూచి "ఉన్నది" అని ఊరడిల్లును. తనయందున్న ఆత్మను తెలిసికొననేఱక తికమకబడువాడు గురూపదేశమున ఆత్మజ్ఞానము కలిగి స్వస్థచిత్తు డవును.

కందుకన్యాయము

బంతిని క్రింద పడవైచిన మీది కెగరి తిరిగి క్రిందపడుచుండును.

ఉదా:---హానివృద్ధులు.

కడారాన్యాయము

"కడారా: కర్మధారయే" అని పాణినీయసూత్రము. కడారా: అనుపదము బహవచన ప్రయోగముమాత్రము నన సూత్రమున ఆదిశబ్ధ మప్రయుక్త మైనను కడారాదులు అను నర్ధమిచ్చుచున్నది.