పుట:SamskrutaNayamulu.pdf/219

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
202

సంస్కృతన్యాయములు

అక్షికాణన్యాయము

కాణశాబ్ధమునకు కాయకంటివాడు అని అర్ధము. అయినను "అక్షికాణ" అందురు.

వాజిమందురా, నీలేందీవర న్యాయమువలె.

అక్షిపాత్రన్యాయము

లూరతంతువులు కంటిలో పడిన గ్రుడ్డుకు బధకలిగించునుగాని యితర అవయములకు స్పృశించినను, మఱే మొనర్చినను ఏమియు చేయజాలవు.

"ఊర్ణాపక్ష్మ యధైవహి కరత్లసంస్థం న విద్యతే పుంభి: అక్షిగతం తు తదేవ హి జనయ త్యరతించ పీడాంచ. కతరలసదృశో బాలో న వేత్తి సంస్కారదు:ఖతాపక్ష్మ అక్షినదృశస్తువిద్వాన్ తేనైపూద్వేజతే గాఢమ్".

అతిసున్నితమై మిక్కిలి చుఱుకు (సూక్ష్మగ్రాహిత్వము)గలతావున నీన్యాయము ప్రవర్రించు;ను.

ఆకాశప్రిచ్చన్నన్యాయము

అనంతమై ఏకమైనను ఘటాదులయందు ప్రతి బింబించి పరిచ్చిన్నమై నానాత్వము నొందును.

పరబ్రహ్మ మనంతము, అద్వితీయము అయ్యు ఉపాధులయందు అనుప్రవిష్టమై పరిచ్చిన్నమై అనెకత్వమున భసించును.