పుట:SamskrutaNayamulu.pdf/220

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
203

సంస్కృతన్యాయములు

ఆఖ్వన్నపిటకన్యాయము

"ఘాతయితుమేవ నీచ: పరకార్యం వేత్తిన ప్రసాధయితుం పాతయితుమేవ శక్తి ర్నాఖో రుద్ధర్తు మన్నపిటమ్".

ఎలుక అన్నమును క్రింద పడవేయగలదు గాని ఎత్తలేదు. దుష్టుడు పరుల కార్యమును చెడఘొట్టుగలడుగాని తిరిగి బాగుచేయలేడు.

"నాహం శక్తో గృహారంభే శక్తోహం గృహభంజనే" అన్నట్లు.

ఆత్మాశ్రయన్యాయము

తనను తానే ఆశ్రయించికొని ఉన్నట్లు.

అదిత్యగరిన్యాయము

ఆకాశముమీద సూర్యుడు కదలుచున్నట్లే కనబడక కొంతసేపటిలో మఱొకచో గనబడును. తెలియకుండగనే మార్పు కనుపడునట్లు నీన్యాయ ముపయోగించును.

అభణకన్యాయము

ప్రతివారు మాటలమధ్య---ఏదో సామెత చెప్పినట్లు---అని ఉపయోగించుచుందురు. కాని ఆసామెత ఏదియో చెప్పరు.

ఆమోదషట్పదన్యాయము

వసననుబట్టి తుమ్మెద పువ్వున్నచోటును గుర్తించును.