పుట:SamskrutaNayamulu.pdf/203

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
186

సంస్కృతన్యాయములు

"హంస" శ్వేతతో బక: శ్వేత: కో భేదో బకహంసయో:, క్షీరనీరపృధక్కారే హంసో బకో బక:."

హంస, కొంగ రెండును వర్ణమున తెలుపే. ఇక వానిలో భేద మేమున్నది" పాలను నీటిని విడదీయుటలోమాత్రముహంస హంసే; కొంగ కొంగే;

దొరబిడ్డ దొరబిద్దే; పకీరుబిడ్డ పకీరుబిడ్డ అన్నట్టు.

హస్తామలకన్యాయము

చేతిలోనిఉసిరికాయవలె. (స్పస్టముగ నున్నదని భావము) కరబదనిన్యాయమును జూడుము.

హస్తపదన్యాయము

ఏనుగూడుగులో అన్ని జంతువుల అడుగులు ఇముడునట్లు.

"స్వరం పదం హస్తినదే నిమగ్నమ్".

"హస్తిపదమున నడగవేయడుగులెల్ల"

"జంతుపదములెల్ల దంతిల్పదంబులో నదగుక్రియ....." (భారత, శాంతి, 5,145.)

అన్నిశక్తులు పరమాత్య్మయం దిమిడియున్నవి.

హస్తిమశకన్యాయము

ఏనుగకు, దోమకు నెక్కద పోలిక ?

"నక్కయేడ దివిజాధ్యక్షాలయంబేడ!" అన్నట్లు.

హిరణ్యవిధిన్యాయము

"యద్యపి హిరణ్యనిధిం నిహిత మక్షేత్రజ్ఞా ఉపర్యుపరిసంచరన్తో న విన్దేయు రేవ మేవేమా: సర్వా: ప్రజా