పుట:SamskrutaNayamulu.pdf/183

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
166

సంస్కృతన్యాయములు

ఒక డొకదేవత నారాధించి యొకకొడుకును సంపాదించెను. కొన్నిదినముల తరువాత నాతడే మఱల మఱొకదేవతనారాధించె మొఱొక కొడుకును సంపాదించెను. అందువలన మొదటిదేవతకు కోపము కలిగి తానిచ్చిన కొడుకును నిమిషములో చచ్చునట్లు చేసెను.

కావున ఒకరినే నమ్మియుండవలెనని న్యాయముయొక్క భావము.

సుధార్ధ్రహరిద్రాన్యాయము

సున్నముతొ దడిసిన పసుపు యెఱ్ఱబడును. జ్భిన్నభిన్న పదార్ధమూల్ కలయికవలన విలక్షణపదార్ధమొదడు పుట్టునపు డీన్యాయము ప్రవర్తించును.

సుపేటికాస్థాపనన్యాయము

అమూల్యవస్తువులను నిరపాయములవు పెట్టెలలో దాచుకొనునట్లు. జ్ఞానులు తమ మానసమును నిర్ణాశవవు బ్రహ్మమునందు నిలిపియుంచుకొందురు.

సుప్తడింభముఖచుంబనన్యాయము

నిదురించు పిల్లవానిమొగము ముద్దుగొనినట్లు. శవమును కౌగిలించు కొన్నట్లు నిష్ప్రయోజనమనిభావము.

నుప్తప్రబుద్దన్యాయము

నిద్రపోయి మేలుకొన్నట్లు.