పుట:SamskrutaNayamulu.pdf/184

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
167

సంస్కృతన్యాయములు

నిద్రకుపూర్వమునగల సుఖదు:ఖములుగాని, భయద్వేషములుగాని, మఱేవియైనను నిద్రావస్థయందుండక దూరమవును. మెలకువవచ్చినంతన వెనుకటి పరిస్థితులన్నియు మఱల నావరించును.

యుద్ధము చేయుచున్న యొక యోధుడు పరబాణార్దితుడై మూర్ఛ మునిగి ఆబాధగాని, యుద్ధముగాని, యెఱుగక మఱచి కొంతతడవట్లే పడియుండి మూర్ఛదేరినవెనుక మరల యుద్ధోద్యతుడై శత్రువుపై బాణప్రయోగ మొనరించును.

అజ్ఞానములో మునిగియున్నంతవరకు ఆత్మ స్వస్వరూప జ్ఞానము లేక భ్రష్ట మవుచున్నను, ఆఅజ్ఞానావరణము విచ్చిపోయినవెనువెంటన తనను తా దెలిసికొనును.

సుబగాబాలోదితాఖ్యాయికాన్యాయము

ఒకస్త్రీ బాలునకు చెప్పిన కధవలె.

ఒకవనిత పిల్లవాని నాడించుచు నీక్రిందికధను చెప్పెను:-

అనగా అనగా ఒకరాజు. ఆరాజుకు ముగ్గురు కొడుకులు. వారిలో ఇద్దరు పుట్టిరి, ఒకడు కడుపులోనే ఉన్నాడు కాని, యింకను పుట్టలేదు. అముగ్గురుకొడుకులు కలిసి ఆడుకొంటూఉండేవారు. ఒకనాడు వారు ముగ్గురును కలసి ఉళకి పట్టణమునకు వేటకు బయలుదేరిరి. త్రోవలో వారికి ఆకాశముమీద పండ్లతో వంగియున్న చెట్టోకటి కంటబడెను. వెంటనే వారాచెట్టు దగ్గఱకు పోయిరి.