పుట:SamskrutaNayamulu.pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
161

సంస్కృతన్యాయములు

ఏదేని యొకపనియందు బ్రవర్తించుట కవకాశము నిచ్చుశాస్త్రము సావకాశాస్త్రము; అవకాశము నీయని శాస్త్రము నిరవకాశశాస్త్రము. ఆరెంటిలో నిరవకాశ శాస్త్రము బలవత్తరము. అనగా ప్రవర్తింపగూడదు అని అది రాజుమాదిరిగ శాసించును.

ఎట్లన-- 'నహీంస్స్యాత్సర్వాభూతాని ' జీవహింస ఎన్నడును చేయరాదు అనునది నిరవకాశశాస్త్రము. 'అగ్నిషోమీయం పశు మాలభేత ' అనుననది సావకాశశాస్త్రము. ఈరేండిటిలో నిరవకాశశాస్త్రము బలవత్తరమై సామాన్యశాస్త్రము నవవాదశాస్త్రము బాధించుచునుగాన కేవలవేదవిహిత యాగాదికర్మమూలందక్క తదితరసమయములందు పశుహింసచేయరాదు అనిబోధించును.

అట్లే--'బొంకు లాడరాదు ' అనునది నిరవకాశశాస్త్రము.

'వారిజాక్షులందు వైవాహికములందు బ్రాణవిత్తమానభంగమందు జజితగోకులాగ్రజన్మరక్షణమందు బొంకవచ్చు; నఘము బొంద దధిప '

అనునది సావకాశశాస్త్రము. ఇందు నిరవకాశశాస్త్రము పై నిర్ధిష్టసమయములందక్క నిక నెన్నడును బొంకజనదు. బొంకిన నఘము బొందుట నిక్కువము అని బోధించును.