పుట:SamskrutaNayamulu.pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
160

సంస్కృతన్యాయములు

వున--- జేయవలసిన యాగములు కొన్ని గలవు. వానిలో అంతర్భాగములుగ మఱికొన్ని యాగములు గలవు. వానికి సాకమేధులు అనిపేరు. అవి మొత్తము ఏడుభాగములు. వానిలో మూడు మొదటి రోజునను తక్కిన నాలుగు భాగములు రెండవరోజునను చేసి మొత్తము కలాప మంతయు రెండు రోజులలో పూర్తిచేయవలెను. కాని, కొందఱు ప్రతియొకభాగము రెండురోజులవంతున మొత్తము కలాపమంతయు పదునాలుగురోజులలో ముగించవలె నందురు. కాని, విధిజ్ఞలు రెండవపక్షమును త్రోసివేసి మొదటిపక్షమునే నిర్ణయించి యుంచిరి.

అట్లే-- ఇన్ని రోజులు; కాదు ఇన్నిరోజులు అని రోజులతో సంబంధించిన వాదోపవాదములయం దీన్యాయము ప్రవర్తించును.

సాధుమైత్రిన్యాయము

సజ్జనులతోటిసహవాసము చిరకాలముండును. దినదిన మభివృద్ధి నొందుచుండును.

అపరాహ్ణచ్చాయాన్యాయమువలె.

సామర్ధ్యయోగన్యాయము

సామర్ధ్యయోగన్యాయము

సామ ర్ధ్యమువలన పనులు నెఱవేఱునట్లు.

సావకాశనిరవకాశన్యాయము

'సావకాశ విరవకాశయో ర్నిరవకాశో బలీయాన్ '