పుట:SamskrutaNayamulu.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
115

సంస్కృతన్యాయములు

వాయుభక్షణన్యాయము

వాయువుమాత్రమే భక్షించినట్లు.

"వాలజల్యాదులు వాయుభక్షణ చేసి అనేకవేల సంవత్సరములు తపస్సుచేసిరి" అనిన గాలి శరీరములోనికి తీసికొనని ప్రాణియే లేదు. అట్లు గాలిని తీసికొనుటను గాలి పీల్చుట అందుము. భక్షీంచుట అనశరీరపోషణమున కవసరమవు నాహారమును భుజించుట అనియర్ధము. కావున వాలఖివ్యాదులు తక్కినప్రాణులవలెగాక యితరపదార్ధాసక్తి త్యజించి కేవల వాయుభక్షణమాత్రమునన దేహము నిలుపుకొనుచు తపస్సు చేసిరి అనిభావము.

బ్రాహ్మణగ్రామ, ఆమ్రవణ, మున్నగు న్యాయముల కీన్యాయము విరుద్ధము. స్వార్ధమే తక్క అన్యవస్తువు నుద్బోదించిదు.

అబ్భక్షణము, వర్ణిభక్షణము మున్నగున విట్లే.

వాయు శైత్యౌష్ణ్యన్యాయము

వాయువునకు చల్లదనము, వేడి, ఆరోపించునట్లు. వాయువునకు గుణము స్పర్శము. అయినను ఆయాసమయములందు జల్లదనము, వేడి సంక్రమించుచుండును.

జలౌష్ణ్య, భూశైత్యౌష్ణ్య న్యాయములను జూడుము.

వార్తాహరన్యాయము

పాముమంత్రములలో అనేకరకములు కలవు. పాము కఱచి నది అని తెలిసినవెంటనే కొందఱు పైయుత్తరీయమును