పుట:SamskrutaNayamulu.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
114

సంస్కృతన్యాయములు

వ్యాక్యర్ధప్రతిపత్తిన్యాయము

వాక్యార్ధము స్పష్టమై యున్నట్లు.

వాజ్నియమన్య్తాయము

వాక్కులు నియమితములై యున్నట్లు. (ఈరెండును అల్వొకికన్యాయములు)

వాజిమందురన్యాయము

ముందురా అనిన గుఱ్ఱములుండుతావు అనినను వాజిమందురా అని అదియే అర్ద్గమున నుపయోగింపబడుచున్నది కరకంకణ, నీలేందీవర, మృగవాగురాన్యాయములన్నట్లు

వాతప్రదీపన్యాయము

గాలిలోని దీపమువలె, నివాతస్థదీపన్యాయమున కియ్యది విరుద్ధము.

వారాదిన్యాయము

వత, పిత్త, శ్లేష్మములవలె, వాతపిత్తశ్లేష్మములు పరస్పరవిరుద్ధము లయ్యు సమానముగ కలిసియుండి శరీరమును రక్షించుచుండును. దేనిలో హెచ్చుతగ్గులు కలిగినను శరీరమునకు భంగము కలుగుట తప్పదు.

సజ్జను లెన్నడు నెట్తి హానియు గలుగనీక పరుల శ్రేయస్సునకే పాటుపడుచుందురు.