పుట:SamskrutaNayamulu.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
106

సంస్కృతన్యాయములు

"ఐతిహ్యం తు న సత్య మత్ర హి వటే యక్షోస్తినా నేతినా | కిం జానాతి కదాచ కేన కలితం యక్షస్య కీదృగ్వపు:||"

వటము నాశ్రయించి యక్షు డున్నా డని లోక ప్రతీతియే గాని నిజముగా ఉండెనో లేదో విచారించిన వారుగాని, వానిస్వరూపాదివిచార మొనరించినవారుగాని, చూచినవారుగాని లేదు, కేవల ప్రతీతి మాత్రమునన లోకము వెఱచుచున్నది.

కావున, అనిర్ణీతమై కేవలపు;రుషవచనపరమపరాగతమైన కించదంతి ప్రమాణము గాజాలదు. ఆయధార్ధమై అనిర్ణీతమై శాబ్దబోధామూలకమైన నిశ్చయము ప్రమాణము కాదు అని భావము.

కేవలప్రతీతులను నిజానిజముఇ; లరయక్ నమ్మి ఆయాకార్యములలో బ్రవర్తించు టనుచిత మని యీన్యాయము యొక్క లౌకికాశయము.

వత్సక్షీరన్యాయము

పాలు అచేతనము లయ్యు దూడకు వృద్ధి కారణమైనట్లు రూపకల్పన మొనరించికొని చేయబడిన సగుణోపాసన క్రమముగ మంస్థైర్యమునకు మూలమై నిర్గుణోపాసనా దార్డ్యము నొడగూర్చును.