పుట:SamskrutaNayamulu.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
105

సంస్కృతన్యాయములు

తోకచుంబకన్యాయము

అయస్కాంతము ప్రత్యేకము తనప్రభావముచూపజాలదు. ఇనుము దగ్గఱ పెట్టిన నాకర్షించి దానినిగూడా అయస్కాంతముగ మార్చివైచును.

లోహాగ్నిన్యాయము

అగ్నిసాహచర్యమున లోహముకూడ అగ్నిధర్మములతోనే ఒప్పును.

"సంసర్గజా దోషగుణా భవన్తి." అట్లేల్ సుగుణములుగూడ.

వాజ్రలేపన్యాయము

వజ్రపుపొడితో బూతపూసినవస్తువువలె.

అతిధృఢముగా నున్నదని చెప్పుట

గోడకు సెమెంటు చేసినట్లు

నటబీజన్యాయము

విస్తారమయిన వతవృక్షమునకు విత్తన మతిస్వల్పమైనట్లు

"విత్తనంబు మఱ్ఱివృక్షంబునకు నెంత"

                                                                                                వేమన.

వటేయక్షన్యాయము

మఱ్ఱి చెట్తుపై యక్షు డున్నాడు అనగా భూత మున్నది

అని చెప్పిన నిజానిజముల విచారము లేకయే నెఱచి పఱచినట్లు.