పుట:SampurnaNeetiChandrikaPart1.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దీర్ఘకర్ణమను పేరుగల పిల్లిని" అన, గ్రద్ద "వెంటనే దూరముగ బొమ్ము. లేనిచో జంపివేయుదు" ననెను.

"దయయుంచి నామాట వినుడు. అనంతరము చంప దగినవాడ నైనయెడల నట్లే చంపివేయవచ్చును. జాతిమాత్రమున నెవ్వరిని జంపివేయనురాదు; పూజింపను గూడదు. సంగతియంతయు దెలిసికొని చంపదగునో, గౌరవింపదగునో నిర్ణయించుట నీతి" అని యా మార్జాలము వేడుకొనగా గ్రద్ద యపుడు "అయినచో జెప్పుము. నీవేమి పనిమీద నిచటికి వచ్చితివి?" అనియడిగెను.

"నే నిచట గంగలో నిత్యము స్నానముచేయుచు మాంసాహారము విడిచి బ్రహ్మచారినై చాంద్రాయణవ్రతము చేయుచుంటిని. మీరు ధర్మజ్ఞానపరులనియు, విశ్వాసయోగ్యులనియు బక్షులన్నియు నెల్లవేళల నుతించుట విని, విద్యచేతను, వయస్సుచేతను బెద్దలయిన మీవలన ధర్మములు వినదలచి మీదర్శనమునకు వచ్చితిని. అన్నిధర్మములు దెలిసిన మీరే మీయింటికి వచ్చిన నన్ను జంపదలచితిరి.

ఇంటికి వచ్చినప్పుడు శత్రువున కయినను గౌరవము చేయవలయును. ధన మీయలేకున్న మంచిమాటలతోనైన నాదరింపవలయును. తన్ను ఛేదించుటకు వచ్చినవానికి సయితము వృక్షము చల్లని నీడయొసగి యాదరించుచున్నది. సాధువులు గుణహీనులయందును దయచూపుదురు. ఎట్టి