పుట:SampurnaNeetiChandrikaPart1.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మార్జాలమునకు జోటిచ్చి దానివలన మరణించిన జరద్గవ మను గ్రద్ద కథ

గంగాతీరమున గృధ్రకూట మను పర్వతమున నొక పెద్ద జువ్విచెట్టు గలదు. దాని తొఱ్ఱయందు మిక్కిలి ముదుసలియై గోళ్లు, దంతములు పట్టుచెడిన జరద్గవ మను నొక గ్రద్ద నివసించుచుండెను. ఆ చెట్టుమీదనుండు పక్షులు దయతో దాము తెచ్చుకొన్న తిండిలో గొంచెము కొంచె మా జరద్గవమున కిచ్చుచుండెను. ఆగ్రద్ద దానితో జీవించుచు బక్షులు గూళ్లు విడిచి పోయినపుడు వాని పిల్లలను గాపాడుచుండెను.

ఒకనాడు దీర్ఘకర్ణ మనెడి పిల్లి యొకటి పక్షిపిల్లలను బట్టుకొని తినుటకై యాజువ్విచెట్టుకడకు వచ్చెను. దానింజూచి పక్షిపిల్లలు భయపడి యఱవ దొడగెను. అంతట జరద్గవ మా యఱుపు విని "యెవ రా వచ్చుచున్న వా?" రని ప్రశ్నించెను.

అపు డాపిల్లి గ్రద్దను జూచి భయపడి "హా, చచ్చితిని! ఇక నేమి చేయుదును? ఆపద మీద బడినపుడు భయపడి పొందగల ప్రయోజనమేమి? పాఱిపోవు టిక శక్యముగాదు. ఉపాయమున దప్పించుకొనవలయును. ఏమైన నగును గాక. దీనితో మాటలాడి నమ్మకము గలిగింప యత్నించెదను." అని యాలోచించి దరిజేరి "అయ్యా! నమస్కారము" అని పలుకగా గ్రద్ద "నీవెవ్వడ" వని ప్రశ్నించెను. "నేను