డను పేరం బరగెను. అతని కీ రెండవ పేరు మహారాష్ట్ర దేశపు భక్తులలో నుత్తముడైన యేకనాథస్వామి ప్రతిష్ఠానపురమునబెట్తెను. ఈ శ్రేష్ఠుడు తల్లిదండ్రుల పావన గుణములను గలిగి వర్దిల్లెను. 1614 సం||న అనగా నా బాలకునకు దొమిదేండ్ల వయస్సున శ్రీరామదేవుడు ప్రత్యక్షమై స్వయముగ మంత్రోపదేశము చేసెనని చెప్పుదురు. అతడుగూడ ననేక మతసంబంధములైన గ్రంథములువ్రాసెను. వానిలోనతడు రామీరామదాసుడను పేరు వేసికొనుచుండెను. సూర్యాజీ మహాపురుషుడయ్యెను. అతని గర్భమున శ్రీరామపాదారవింద భక్తుడను, వానర వల్లభుడునైన మారుతి (హనుమంతుడు) జన్మించునని సిద్ధులు సెలవిచ్చిరట. జనులీ మాట విశ్వసించి యట్టియవతారపురుషుని కొఱకు నెదురు చూచుచుండిరి. మహారాష్ట్రదేశమున నా కాలమున చాలమంది భక్తులు జనించిరి. వారందఱిలొ బ్రతిష్ఠాన పురవాసియైన యేకనాథస్వామి మిక్కిలి గొప్పవాడు. ఆయన రాణోజీబాయి సోదరుడైన భానోజీకి గురువు. ఏకనాథుని యొక్క గురువు పేరు జనార్దనస్వామి. గురువుగారి గురువుయొక్క తిథి ప్రయోజనమునకై ప్రతిసంవత్సరము భానీజీరావు ప్రతిష్ఠానపురము వెళ్ళుచుండును. అతడు సోదరియైన రాణోజీబాయిని తనవెంట దీసికొని పోవుచుండును. పరమభాగవతుల యెడల మిక్కిలిభక్తిగల సూర్యాజీ యేటేటభార్యతో గలసి యేకనాథుని సేవ జేయుటకై ప్రతిష్ఠానపుర మరుగుచుండును. ఆయాత్రలో బలుసారులు మహానుభావుడైన ఏకనాథుడు హనుమంతుడు వారి గర్భమున దప్పక యవతరించునని నొక్కి వక్కాణించుచు వచ్చెను. ఆత డొక్కడేగాక యేకనాథునివలెనే మహారాష్ట్ర దేశభక్తు లందఱు నట్టి యవతార పురుషుడు తమ దేశము నలంకరించునని వాక్రువ్వజొచ్చిరి. అట్లే క్రీ.శ. 1608 వ సం.న సూర్యాజీవంతు రామాయణపారాయణము జేయుచుండగా రెండవకుమారుడు గలిగెనని శుభవార్త దెలిసెను. సూర్యాజీవంతు శ్రీరామనవమి మహోత్సవము చేయనారంభించి నవమినాడు మధ్యాహ్నము రెండు జాములవేళ రామవిగ్రహముపై నవపుష్పములు వైచి పూజ చేయుచుండెను. ఆ పుణ్య సమయముననే రెండవపుత్రు డుద్భవించెను. అతని యానందమునకు
పుట:SamardaRamadasu.djvu/7
Appearance