పుట:SamardaRamadasu.djvu/8

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

మేరలేదు. శ్రీరామనవమి నతుడు మునుపటికంటె రెట్టింపు భక్తితోను, సంతోషముతోనుజేసి గ్రామవాసులందఱకు మధురపదార్థములనుబంచి పెట్టి పుత్రోత్సవము గావించెను. ఆబాలుని మొట్టమొదటి పేరు నారాయణుడు. ఆ తరువాత నతడు రామదాసు డనియు సమర్థరామదాసు డనియు లోకమున వ్యవహరింపబడెను. మరుసటి సంవత్సరము సూర్యాజీవంతును రాణోజీ బాయియు యాత్రార్థమై ప్రతిష్ఠానపురమునకరిగిరి. తల్లిదండ్రుల వెంట కుమారులిద్దరు పోయిరి. ఆంజనేయస్వామి యవతరించునని ఏకనాథస్వామి చెప్పుచుండుటచేత భార్యాపుత్రసమేతుడై సూర్యాజీ వచ్చుచున్నాడని విని ఏకనాథుడు మిక్కిలి సంతోషించెను. అతడు మేర మీరిన సంతోషముతో నా యవతార పురుషు నెదుర్కొనుటకు బోయెను. ఏకనాథుడు రామదాసు నెత్తుకొని యానందపారవశ్యమున నాట్యముచేసి యిటువంటి కుమారుని గన్న తల్లిదండ్రులు ధన్యులు. ఈ దేశము ధన్యదేశము. మీ నోములు పండినవి. మీతపము ఫలించినది యని ప్రశంసించి యా బాలుని దీవించెను. శివుని యనుగ్రహమున నీ నందను డుదయించెను. ఇతడు నూతనశకమును స్థాపించి లోకుల బాధలు తొలగించి దేశము నుద్దరించెను. ఇటువంటి మహాపురుషుడు మనమధ్యమున జన్మించెను గాన నా జీవితము గూడ ధన్యమైనది. ఇంక నేను నా జీవితరంగముమీది కట్ట కడపటి తెఱ పడవై చెదను అనికూడ ఏకనాథుడు వచించెను.

_______