పుట:SamardaRamadasu.djvu/59

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వానిసేవ చెల్లాచెదరై పాఱిపోయెను. ఈవిధముగ శివాజీ క్రమక్రమముగ బలవంతుడై 1664 వ సంవత్సరమున మహారాష్ట్రమునకు మహారాజై పట్టాభిషేకము చేసికొనెను. రామదాసుడు తన బోధనమను వల పన్నునప్పటికే శివాజీ రాజయ్యెను. రాజైనను శివాజీ గర్విష్ఠుడు గాక యేయోగి గనబడినను రాజ్యము వదలి వారివెంట బోవుచుండెడివాడు. భజనలు కీర్తనలు నెచ్చట జరుగుచుండినను నచ్చట కతడు బోవుచుండెడివాడు. దైవభక్తి యాత్మజ్ఞానము మఱచువాడుగాడు. రాజ్య మద మెంత మాత్రము నతనికి లేదు.

శివాజీకి శ్రీతుకారాంబావాజీ యనిన మిక్కిలి భక్తి. ఎంత దూరము నందుండియైన నతని భజనలకు గీర్తనలకు వెళ్లుచుండెడివాడు. ఆతడు భక్తిపారవశ్యమున నొకనాడు తుకారాము కడకు బోయి నిజమగు భక్తి నుపదేశింపు మని యతనిని బ్రార్థించెను. తుకారాంబావాజీ "నేను కాదు నీ కుపదేశించువాడను. మంచి యుపదేశము కావలసినయెడల నీవుపోయి సమర్థ రామదాసుని కాళ్లపై బడు" మని మృదుమధుర భాషణములతో నానతిచ్చెను. రామదాసు యొక్క మతబోధనంతయు శివాజీ యెఱిగినవా డగుటచే నతని దర్శనము చేయవలెనని యప్పుడప్పుడు తలపోయుచుండెను. కాని యవకాశము చిక్కలేదు. రామదాసుని యొక్క జాడలు తెలిసికొనవలెనని శివాజీ పలుమాఱు ప్రయత్నించెను. కాని రామదాసుని శిష్యులకే యతని జాడలు సరిగ దెలియవు. శివాజీకి రామదాసు నతని బోధకుల యెడల మిక్కిలి భక్తి గలదు. అందుచే నతడు బోధకుల గలసినప్పుడెల్ల వారికి గౌరవ ప్రపత్తులు జరుపు చుండెను. రామదాసుని యాత్మజ్ఞానమును నిండు పూనికను మహారాష్ట్ర దేశోద్ధరణ సంకల్పమును శివాజీ గురైఱిగి యుండెను. రామదాసుని యుద్యమమే మహారాష్ట్ర దేశమున వీలైనంతవఱకు నిజమైన యుద్యమము. అంతకుముం దిట్టి యుద్యమ మెందును లేదని శివాజీకి దెలియును. ఎట్లైన రామదాసుని జూచి తీరవలెనని శివాజీ యొకమాఱు నానా మఠములను నానారణ్యములను దిఱిగి వానిపొడ గానక రామదాసు దర్శన మగువఱకు నన్నము ముట్ట నని నీరు త్రాగ నని ప్రతిన బట్టెను. ఎట్టకేలకు శివాజీ యెట్టయెదుట నొక