పుట:SamardaRamadasu.djvu/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నాలుగవ ప్రకరణము

నారాయణుడు రామదాసు డగుట.

పెండ్లిపందిరిలోనుండి నారాయణుడు తిన్నగా నూరి బయటికి బోయి యొక చెట్టు తొఱ్ఱలో మూడు దినములు దాగుకొనెను. అక్కడ నతడా మూడు దినము లన్నపానములు లేక యెవరికి గనబడక యుండెను. అక్కడనుండి యతడు కృష్ణానదిగట్టు దారిబట్టి నాసిక పంచవటికి బయనమై పోయెను. అక్కడ నతడు శ్రీరామ దేవాలయమున కరిగి యా దేవుని దర్శించి యటనుండి తకిలీ యను నొక చిన్న గ్రామమునకు బోయెను. అచ్చట నతడు ఘోరమగు తపమాచరించి బహుకష్టముల బడజొచ్చెను. అతని నిత్య జీవిత మీలాగున నుండెను. పెందలకడ నిద్రలేచి గోదావరినదికి బోయి నడుములోతు నీళ్ళలో నిలిచి స్నానము చేసి సంధ్యావందనము చేసి మంత్రములు చదివి పరమధ్యాననిష్ఠుడై యుండును. ఈవిధముగ నతడు క్రమము దప్పక ప్రతిదినము ప్రొద్దు నెత్తిమీదికి వచ్చు వఱకు జేయుచుండును. ఆ సమయమున మత్స్యములు మొదలయిన జలచరములు వానికాళ్ళు కొఱికి పుండ్లు చేయుచుండును. నిరంతరము నీటిలో నుండుటచే నడుము క్రింది భాగము తెల్లబడి యుండెను. రెండు జాముల తరువాత నతడు తన బసకు సమీపమున నున్న కొన్ని యిండ్లకు మాత్రమే పోయి మాధుకరము చేసికొని దేవునకు నైవేద్యము పెట్టి, యది దినమున కొక్కసారి మాత్రమే భుజించును. తన గుహలో గూర్చుండి భోజనానంతరమున నతడు రాత్రి ప్రొద్దుపోవువఱకు ధ్యానశ్లోకములను గట్టిగ జదువు చుండును. ఆయన పదిమందితో గలసి మెలసి యుండక సంఘ జీవితమును బరిత్యజించి యేకాంతముగ నుండుటకే యిష్టపడెను. రామదాసుడు చేసిన ఘోరతపస్సుచేత నతని శక్తి యుడిగెను. మేను శుష్కించెను. అప్పటికతడు ద్వాదశవర్షప్రాయుడు మాత్రమేయని పాఠ