రాళ్ళు రువ్వఁ జొచ్చెను. అనేకులు నారాయణుఁడు పిచ్చివాఁడైనాఁడని తలంచి "నీకుఁ బిచ్చియెత్తిన"దని బవానిమొగముమీఁదనే యనఁ జొచ్చిరి. ఈ మాటలచెత నతఁడు విసిగిపోయి కోపోద్రేకము నఁపుకొనలేక చెట్టు క్రిందనున్న లోఁతునూతిలో దుమికెను. అది చూచినవారు నిశ్చేష్టులై వాని బంధువులు తమ్ము నిందింతు రేమో యని భయపడి గబగబ పారిపోయిరి. బాగుగ బనీఁత నేర్చిన కొందఱు నూఁతిలో ఉరికిరి. కాని యతఁడు కనుపింపఁ డాయెను. ఈఁతగాండ్రు నూఁతిలో వెదకి వెదకి వాని జాడఁ గనుగొనలేక విసిగి యతఁడు క్రోధావేశమున నూతిలో బడి చచ్చె నని నిశ్చయించి యా దుర్వార్త సోదరునకును దల్లికిని దెలియఁ జేసిరి. నారాయణునకు నేమియు భయములేదని శ్రేష్ఠుఁడు తల్లికి ధైర్యము చెప్పెను గాని పుత్రశోక జ్వరముచేతఁ గుందుచున్న తల్లిదుఃఖము నతఁడు సహింపలెకపోయెను. శ్రేష్ఠుఁడు తనకు సహజమైన మనోధైర్యముతో నూతికడకుఁ బోయి "నారాయణా! నారాయణా! నేను వచ్చినాను రా!" అని పిలిచేను. వీక్షించు వారందఱు విస్మయము నొందునట్లు నారాయణుఁడు వెంటనే నూతినుండి బయటకు వచ్చి సోదరునితోఁ బోయెను. అన్నగారి యెడల నారాయణునికి నత్యంత భక్తి గలదు. చెట్టుమీదనుండి నూతిలోఁబడినప్పుడు నారాయణుని మొగము మీఁద నొక బొప్పి కట్టెను. అది యతని జీవితాంతము వఱకు మానక యుండెను. ఈవిషయము వలన నారాయణుని వివాహ ప్రయత్నము కొన్ని నాళ్ళాఁగి పోయెను. కాని పూర్తిగ నాఁగిపోలేదు. గ్రామ పురోహితుని మాటమీఁద నారాయణుని తల్లి యతనిని వివాహమాడు మని మాతృ సహజములైన శీతలవాక్యములతో వివాహమున కతఁడొడంబడునట్లు చేయ యత్నించెను. శ్రేష్ఠుని వలె నారాయణుఁడు కూడ గృహస్థుఁడై సంసారముఁ జేయుచుండఁగాఁ జూడవలెనని యామె కెంతో యిష్టము. ఎట్టకేలకు మంచి సమయముఁజూచి యొకనాఁడు రాణూబాయి కుమారుని జేరఁబలిచి తన జన్మము వాని వివాహము వలననే సఫల మగునని, దన కున్న కోరిక యదొక్కటియె యనియు నొక్కి చెప్పి బలవంతపెట్టెను. ఎంత వేఁడినను దల్లిమాట కతఁడిదమిత్థ మని ప్రత్యుత్తర మీయలేదు. తల్లిమాట కెదురా
పుట:SamardaRamadasu.djvu/13
స్వరూపం