Jump to content

పుట:SakalathatvaDharpanamu.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

7

12. తాపత్రయము.

అధ్యాత్మికము, అధిభౌతికము, అధిదైవికము యీ 3 న్ను తాపత్రయములు.

వాత పైత్య శ్లేష్మములవల్లవచ్చెడిదు:ఖము ఆధ్యాత్మిక మనంబడు,

సర్ప వృశ్చిక వ్యాఘ్ర చోరాదులచే వచ్చెడు దు:ఖము అధిభౌతిక మనంబడు,

గాలి, వాన, పిడుగులు, రాళ్లు మొదలయినవానిచే గలిగెడు దు:ఖము అధిదైవిక మనంబడు,

యీతాపత్రయము అంత:కరణముతో గూడిన శరీరమునకేకాని, ఆత్మస్వరూపుడౌ తనకు లేదని వేదాంతసిద్దాంతము.

13. వ్యాధిత్రయము.

వాతము, పైత్యము, శ్లేష్మము యీ 3 న్ను వ్యాధిత్రయ మనబడును.

వాతమునందు బుట్టినరోగములు 10,

పైత్యమునందు బుట్టినరోగములు 82,

శ్లేష్మమందు బుట్టినరోగములు 224, కూడారోగములు 38

ఇట్టిరోగముల కాలయమైన యీశరీరమందు భ్రాంతి లేక ఆత్మావలోకనము జేయుచుండవలెనని సిద్దాంతము.

14. ప్రతిబంధత్రయము.

భూతప్రతిబంధము, వర్తమానప్రతిబంధము, భావిప్రతిబంధము యీ 3న్ను ప్రతిబంధత్రయ మనబడును.

భూతప్రతిబంధ మనగా:- బహుకుటుంబిని యగు నొక బ్రాహ్మణుడు జీవనార్ధమునకై నొక యెనుమును సంపాదించుకొని దానివలన కుటుంబసంరక్షణ జేయుచుండెను. అంత కొంత కాలంబునకు కర్మవశంబున పుత్రమిత్రకళత్రాదులున్ను యెనుమున్ను నశించెను. అప్పుడా బ్రాహ్మణుండు విరక్తుండై సద్గురు సాన్నిధ్యంబున శ్రవణాదులుచేసెను. అంత నొక సమయంబున నతనిగురుండు చేరంబిలిచి నీవు బహుదినంబుల నుండి శ్రవణాదులు చేసితివే కృతకృత్యత నీకున్ దోచియున్నదా యనిన, అతను మరి యేమియుంగానను. పూర్వము ఒక యెనుమును సంపాదించికొనియుంటిని. అది నాడె మృతించెను. అయినప్పటికిని శ్రవణమనననిధి ధ్యాసకాలంబులయందు ఆయెనుమే సాక్షాత్కారమై యున్న దని యధార్థంబుగా విజ్ఞాన