పుట:SakalathatvaDharpanamu.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
4. దశనాడులు.

ఇడ, పింగళ, సుషుమ్నా, గాంధారి, అస్తిజిహ్వ, పూష, యశశ్విని, అలంబుష, లకుహ, శంఖిని యీ10న్ని దశవాయువు లనంబడును.


ఇడకు - చంద్రస్థానము, రుద్రుడధిదేవత,
పింగళకు - సూర్యస్థానము, విష్ణువధిదేవత,
సుషుమ్నకు - అగ్నిస్థానము, బ్రహ్మ అధిదేవత,
గాంధారికి - 2 కుడికన్ను స్థానము, వరుణుడధిదేవత
అస్తిజిహ్వకు - యడమనేత్రస్థానము, వరుణుడధిదేవత
పూషకు - కుడికర్ణస్థానము, దిగ్దేవత లధిదైవములు
యశశ్వినికి - యడమకర్ణస్థానము, పద్యోద్భవుండధిదేవత
అలంబుషకు - గుదనాళ్ళస్థానము, సూర్యుడధిదేవత
లకుహకు - మధ్యనాళస్థానము, భూమి అధిదేవత
శంఖినికి - నాభీస్థానము, భూమి అధిదేవత

5. దశనాడీచక్రము.

నాళ్ళు స్థానములు పక్షాంతర స్థానములు అధిదేవతలు
ఇడా యడమ నాసాబిలము చంద్రస్థానము రుద్రుడు
పింగళా కుడి నాసాబిలము సూర్యస్థానము విష్ణు
సుషుమ్నా మధ్యదేశము అగ్ని బ్రహ్మ
గాంధారి వామనేత్రము కుడికన్ను వరుణుడు
అస్తిజిహ్వ కుడి నేత్రము యడమ కన్ను వరుణుడు
పూష కుడికర్ణము కుడికర్ణము దిగ్దేవతలు
యశశ్విని వామకర్ణము యడమ చెవి పద్యోద్భవుడు
అలంబుష వక్త్రము గుదము సూర్యుడు
కుహు లింగ దేశము మధ్యనాళము భూమి
శంఖిని మూలాధారం నాభి భూమి

ఈదశనాడులయందు ఏతత్ పూర్వోక్త దశవాయువులు ప్రవహిం