పుట:SakalathatvaDharpanamu.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
6. దశనాదములు.

చిణీనాదము, చిణిచిణీనాదము, ఘంటానాదము, మృదంగనాదము, మేఘనాదము, శంఖనాదము, వీణానాదము, తాళనాదము, వేణునాదము, భేరినాదము యీ10న్ని దశనాదము లనంబడును.

7. దశవిధ మండలములు.

వియన్మండలము, తమోమండలము, మేఘమండలము, విద్యున్మండలము, తారామండలము, జ్యోతిర్మండలము, సూర్యమండలము, చంద్రమండలము, వహ్నిమండలము, హిరణ్మయమండలము యీ10న్ని దశవిధమండలము లనంబడును.

8. దశవిధ సిద్ధులు.

చిరజీవత్వము, వాయువేగము, అదృశ్యత్వము, వస్తునిర్మాణము, పరభావత్వము, దూరదృష్టి, నిరాహారత్వము, వాక్యసిద్ధి, దూరశ్రవణము, కామరూపము యీ10న్ని దశవిధసిద్ధు లనంబడును.