పుట:Sahityabashagate022780mbp.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

72

ఆదర్శం అయాయి. 1920 ప్రాంతంలో గాంధి మహాత్ముని జీతీయోద్యమ ప్రభావం చేత ఎన్నో మధుర్ కంఠాలు గళం విప్పుకున్నా 'మాకొద్దీ తెల్ల దొరతనము ' 'దండాలండోయిబాబు మేముండలేమండోయి ' అనే గీతాలు, అల్లూరి సీతారామరాజు గారిని గూర్చిన వీరకరుణాత్మక గేయాలు, 'కొల్లాయి కట్టితేనేమీ మా గాంధి కోమటైపుట్టితేనేమి ' వంటి బసవరాజు అప్పారావుగారి గీతాలు-ఇట్లా అసంఖ్యాకంగా గేయ రచనలు వాడుక భాషలో వాతావరణాన్ని పులకరింఫ చేశాయి. చిన్న చిన్న గేయాలే కాక విస్తృత ప్రణాళిక గల వచన గ్రంధాన్ని వ్యావహారిక భాషలో నడిపించవచ్చని ఉన్నవ లక్ష్మీనారాయణ పంతులుగారు 'మాలపల్లి ' అనే తన గొప్పరచనంలో నిరూపించారు.. పండిత వర్గంలో విశాల దృకధం కలవారు కూడా ఆధునిక భాష, సాహిత్య పల్యంకికలో ఊరేగడం సమర్ధించారు. పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రిగారు అట్టివారు. ఉన్న వర్గాలవారు వాడే వ్యవహారికభాషనే కాక పామరజనులయాసతో కూడిన భాషను కూడ గేయాల్లో ఆదరించారు. నండూరి సుబ్బారావుగారు, వెరియేంకిపాటలు రసహృదయాన్ని బాగా ఆకట్టుకున్నాయి. "యెనక జలమంలోన, ఎవరమోనంటి-సిగ్గొచ్చినవ్వింది సిలక నాయెంకి" ప్రాచీనమైన చర్విత చర్వణమై, నీరసమై పోయిన ప్రబంధ కవిత్వం మీద తిరుగుబాటుగా లేచింది భావకవిత్వము. స్వామి శివశంకరులు, దేవులపల్లి కృష్ణశాస్త్రి వంటివారు దేనికి వేగుచుక్కలయ్యారు, ఇక్కడ ఒక విచిత్రమైన సమన్వయం అప్రయత్నంగానే రూపు దాల్చింది. పూర్వపు చందస్సులో పద్యాలు వ్రాసినప్పుడు సరళ గ్రాంధికశైలినీ, గేయాలు వ్రాసినప్పుడు గురజాడరీతిలో వ్యవహార భాషను వీరు సంతరించారు. విశ్వనాధ సత్యనారాయణ గారు, వేంగీ క్షేత్రం వ్రాసినప్పుడు ప్రౌఢసమాస జటిలమైన గ్రాంధికరీతిని, కిన్నెర సాని పాటలు వ్రాసినప్పుడు లలిత రమణీయమైన వ్యవహారపు పలుకుబడినీ చిందించారు. భావకవిత్వం మీద తిరుగుబాటుగా బయ్హలుదేరిన అభ్యుదయ కవిత్వంలోనూ, ఈనాదు శ్రీ దాశరధి, శ్రీ నారాయణరెడ్డి నాయకత్వం వహించే సమన్వయ కవితా రీతిలోను కూడా ఇదే వ్యవస్థ నడుస్తూంది. పద్యకవిత్వానికి సరళమో, ప్రౌఢమో అయిన గ్రాంధిక భాషయూ, గేయ ప్రసంగం వచ్చినప్పుడు మృద్లవితమైన జీవద్బాషయూ వాడడం కవులలో ఒక అలేఖ్య సంప్రదాయం అయింది. భవిష్యత్తులో కూడా ఇది ఇట్లాగే ఉండవచ్చుననిపిస్తుంది. అభుదయ కవితా పితామహులైన శ్రీశ్రీ కూడా కవితా వ్యవసాయం యొక్క పూర్వరంగంలో పద్య చందస్సును ఆదరించి విప్లవ శంఖారావం పూరిస్తూ 'మహా ప్రస్థానం ' ఆలపించినపుడు గేయాన్ని, వ్యవహార భాషనూ చేపట్టారు. ఇదియొక సత్సంప్రదాయంగా నిలిచిపోయే సూచనలున్నాయి.