పుట:Sahityabashagate022780mbp.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

74

   వచన రచన విషయంలో ఇప్పటికీ పూర్వ పద్దతిని పాటించేవారు ఉత్తాలమైన సాహిత్య స్థానం కలవారూ లేకపోలేదు.  విశ్వనాధ సత్యనారాయణ గారు, నోరి నరిసింహశాస్త్రిగారు వంటి కొద్దిమంది నవలల్లోను వాచకాల్లోను సరళ గ్రాంధీకాన్ని ఆచరిస్తూ ఉన్నారు.  పూర్వతరం గొప్ప నాటక రచయితలందరూ ధరెమవరం కృష్ణమాచార్యులు, కందుకూరి వీరేశలింగం, పానుగంటి లక్ష్మీనరసింహారావు, తిరుపతివేంకట కవులు, బలిజేపల్లి లక్ష్మీకాంతం మొదలైనవారు గ్రాంధికభాషనే చేపట్టారు.  తెలుగునకు నూతన కవిత్వం వంటి పెక్కు ప్రక్రియల్లో వ్యవహార భాషకే పట్టాభిషేకము, ఈ రీతులన్నీ 1930 ల నాటికి యువకులుగా ఉండిన సాహితీపరులు ఆచరణలోనికి తెచ్చినవే, యువతరం ఎప్పుడూ సంస్కారం పక్షాన  విప్లవంవైపున ఉండడం సహజం.  వయసు మళ్ళిన కొద్దీ వారే మళ్ళీ సమన్యయ వాదులుగా పరిణతి చెందుతూంటారు.  ఇది మానవ స్వభావ చక్రపరిభ్రమణంలో ఆభ్యస్తమైన విషయము.  గత ఏబది అరువది సంవత్సరాల్లో వార్తాపత్రికలు నడపడం దేశంలో ప్రవేశించింది.  వాటిల్లో మాస, పక్ష, వార, దినపత్రిలు క్రమంగా ప్రచారంలోకి వచ్చాయి.  ఈరకం వ్యవసాయంలో కూడా వెనుకతి తరంలో సులబగ్రాంధికము, ఇటీవలి సంవత్సరాల్లో శిష్ఠవ్వవహారభాష చోతు చేసుకున్నాయి. సుల్భగ్రాంధికమనగా రేఫద్వయ నిర్బంధమూ, అర్ధానుస్వార యోగమూ ఉపేక్షించడము, క్లేశకరమైన సంధి విధానాన్ని విడిచిపట్టి కొంతవరకూ విసంధి పాటించడము, దీర్గసంస్కృత సమాసాలు, శ్లేషయమకాద్ల్యలంకారాల సందడిని పరిహరించడం, సులభార్ధప్రతీతి గల పదజాలం ప్రయోగించడము, ఈ మొదలైన భాషా సంస్కారము.  నామప్రత్యయాలు క్రియాంతాలు పూర్వభాషలో వలెనే ఉంటాయి.  ఇటీవల సర్వస్వేచ్చా ప్రియులైన యువసాహిత్యకులు వీరవ్యవహార భాషకు మొగ్గుతున్నారు.  ఏమైనా సాహిత్యం అన్నది దై నందిన వ్యవహారం కంటె కొంత ఉన్నతమై, ఉదాత్తమై, సభ్యమై ఉండక తీరరు.  కానినాడది సాహిత్యం మానవుణ్ణీ కేవల భౌతిక వాతావరణాన్నుంచి పైకి ఎత్తి భావములు ప్రక్షాళనచేసి, హృదయం పునీతం చేసి, మెత్తపరచి, సమదృష్ఠిని శిక్షించి అలౌకితత్వానికే, గ్రాహ్యమైన దివత్వానికి అధిరోహింప చెయ్యడం అని అన్ని కాలాల్లోను అన్ని దేశాల్లోను విజ్ఞలు అయినవారు భావిస్తూ వచ్చారు.  భాష దీనికి ప్రముఖ సాధనం.  ఇతర కళలునూ సంభావ్యములే, మానవ హృదయాన్ని మృదులీకరించి విస్పారింతం చెయ్యడానిక్జి తోడ్పడేది గ్రాంధిక శైలి అయినా ఒకటే; వ్యవహార భాష అయినా ఒకటే.  ఏదైనప్పటికీ అత్యధిక సంఖ్యాకులైన జనావళికి ఉపగమ్యమై, ఆనందాదాయకమై, తిరిగి వారు తమతమ ప్రతిభమేరకు సాహిత్య సృష్ఠిలో ప్రయోగించడానికి అనువైనదై ఉండాలి.  ఇతిశివమ్