పుట:Sahityabashagate022780mbp.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

57

మంటిచూపు సామాన్య సంసారియైన పెద్దన భొగ జీవితాన్ని ఊహిస్తాడు. చక్రవర్తి యైన కృష్ణదేవరాయలు దారిద్ర్యాన్ని, కస్యక్లెశాన్మి ప్రత్యక్షీకరించుకోడానికి యత్నిస్తాడు. రాయలు పెద్దనామాత్యుని ఇట్లా సంభావించాడు.

   హితుడవు చతురవదోనిధి
   పతుల పురాణాగమేరిహాన కదార్ధ
   స్మృతియుతుడ నాంద్ర కవుతా
   పితామహూదా నెవ్వరీడు పేర్కొన నీకున్.

‘శిరీషకుసుమపేశల సుధామయోక్తుల ‘లో స్వారోచిష మనుసంభవము వ్రాయమని కోరారు. అయినా ఈ పేశలోక్తులు సంభాషనల్లో మాత్రమే కొంత లిభిస్తాయి

   ‘ఎవ్వతెవెవీవు భీతహరినేక్షణ యొంటిజరించె దోటలే కివ్వనభూమి
    ‘ పాటున కింతులోర్తురె కృపారహితాత్మక, నీవు త్రోపని
     చ్చోట భవన్న ఖాంకురముసోకె గనుంగొనమంచు జూపియ
     ప్పాటల గంధివేదననెపంచిడియేడ్చె ‘. మనుచరిత్ర
     
     విష్ణుచిత్తుడు మన్నారుదేవునితో విన్నవించుట
     ‘గృహ సమ్మార్జనమో జలాహరణమో శృంగార పల్యంకికా
     వహనంబో, వనమాలికా కరణమో వాల్లభ్యలభ్యధ్వజ
     గ్రహణంబో, వ్యజనా తపత్రదృతియో, ప్రాగ్దీపికారోపమో
     నృహరీ ! వాదములేల లేరె యితరుల్ నీలీలకున్ దాత్రముల్
                                   ఆమిక్తమాల్యద

    వర్ణనా సందర్బములందు తెలుగును విడిచి కవులు సంస్కృతాన్నే ఎక్కువగా ఆశ్రయించడం ఈ ప్రబంధయుగ సాహిత్య లక్షణము. ప్రవరుణ్ణి వర్ణిస్తూ పెద్దన ‘ఆపురి నాయకుండు మకరాంక మనోజ్ఞమూర్తి ‘ అని సమాస గంభీరంగా వ్రాస్తే, విష్ణుచిత్తుణ్ణి వర్ణిస్తూ ‘అందుండున్ ధ్యయ సద్మ పచ్మపదనుండ ద్వంద్యుడ శ్రాంతయో గాందూబద్ద మధుద్విషద్విరధుడు ‘ అంటూ రస్యలవారు ప్రౌడతరంగా సాగిస్తారు. హిమవత్పర్వతాన్ని వర్ణిస్తూ పెద్దన ‘ఆటచనిగాంచె భూమిసురుడంబర చుంబి శిరస్సరజ్ఘరీ పటల ముహుర్ముహు ర్లుక ధభంగ తరంగ మృదంగ ‘ ఇత్యాదిగా అనుప్రాస మోహనంగా వ్రాస్తే, రాయలవారు మాలదాసరి చూచిన మఱ్ఱిచెట్టును ‘కాంచెన్ వైష్ణవుడర్ధ యోజన ‘ ఇత్యాది శార్ధూల వృత్తం అంతా నిండే ఏకసమాసఘటన