పుట:Sahityabashagate022780mbp.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నన్నయ తిక్కనల వారసులు

     అనంతర కవులంతా ఒక వుధంగా నన్నయ తిక్కనల వారసులే అయినా ఇద్దరు కవులు వారి భావాలను భాషను పుణికి పుచ్చుకొన్నారు.  ఎఱ్ఱాప్రగడ బమ్మెర పోతరాజు నన్నయ తిక్కనలమీద అపార భక్తిశ్రద్దలు కలవారు,  అందులోను ఎఱ్ఱనార్యుడు పుంజీభవించిన వినయమూర్తి.  నోరార నన్నయ తిక్కనలను తన గ్రంధాల్లో పొగిడాడు.  అంతేకాక నన్నయ కవిగా రీతి కొంత కనబడునట్లు అరణ్యపర్వశేషం వ్రాశాడు.  హరివంశంలో తిక్కనసోమయాజి పదము వెంట నడిచి సంస్కృతము పాలుతోపాటు చిక్కని తెలుగురచనకూడా సాగించాడు. గోప జీవితమును ఈయన పరిశీలించినంత సన్నిహితంగా ఏ తెలుగు కవీ పరిశీలించలేదు.  ఆ ఘట్టాలు వర్ణించడంలో చక్కని తెలుగు నుడికారాన్ని ప్రదర్శించాడు.  మానస హృదయాన్ని మాతృహృదయాన్ని ఈయన అచ్చపు తెలుగుతనంతో వర్ణించాడు.  యశోద బాల కృష్ణునకిఉ వెన్నలు పెట్టడం

"ముదముతో గడ్పునకుబెట్టి మూతిజిడ్డు మోమునకు మేనజమరి యమ్ముదిత
  యక్కు గలయ నిమురు నేనుగుదిన్న వెలగపండు నాగనొప్పు గృష్ణుడు
  చారునయనుడగుచు."
                                                              (హరివంశము)

    బమ్మెరపోతరాజు కూడ నన్నయ తిక్కనలయందపారమైన భక్తిగలవాడే. తన్ను అనుగ్రఃఇంచుటకై వారు భాగవతంకూడా వ్రాసిపెట్టకుండా మిరిల్చారని కృతజ్ఞతలో చెప్పుకున్నాడు.  సంస్కృతప్రియులను సంస్కృత భూయిష్టరచనతోను తెనుగువచ్చే వారిని తెలుగు నుడికారంచేతను ఆరాషిస్తారని ప్రతిజ్ఞచేసి నిలుపుకొన్నాడు.  అయినప్పటికి పోతనమీద ఆయనకు కొంత ముందర వర్దిల్లిన నాచన సోమనాధుని ప్రభావం అధికంగ్తానే పడింది.  పోతన రచనలో సంస్కృతపు పాలు కొంత ఎక్కువగా కనబడుతుంది.  కవుల పాండిత్య ప్రదర్శనానికి వచనము ఒక రంగంగా తయారయింది.  దీర్ఘములైన పట్టికలు శ్లేష యమకాదులు  గుప్పించడానికి వచనము ఒక సాధనంగా దిగజారింది.   వచనంలో ఉండవలసిన ప్రసన్నత, వైశర్యము లుప్తప్రాయములయాయి.  అలంకారక రచనమీద మోజుకూడా విస్తారముమయింది.  నన్నయ భట్టు వచన రచన పద్యరచనలాగే చాలావరకు సులభంగా ప్రసన్నంగా ఉన్నా కద్రూవినతల ఘట్టంలో సముద్ర వర్ణనచేస్తూ చమత్కారంకోసం రెందు మూడు శ్లేష వాక్యాలు మార్చాడు.