పుట:Sahityabashagate022780mbp.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రధ-అరధ, షష్టీ కువర్ణకమునకు పూర్వము నగాగమము చేయుకుండుట. సభమకు సభమునకు బదులు-వైరిసమాసములు-అమరలేమలు. అమర సంస్కృతము. లేమ దేశ్యము. ఇట్టిదే మంత్ర కాటుక ఇటువంటి రూపాలు శాసనభాషలో తరచువస్తాయి. వ్యవహారభాషకు సమీపంగా వెళ్లుటకు నన్నె చోడుడు ఇట్లాంటి ప్రయోగాలు చేసి ఉంటాడు. ఇదియే జాను తెనుగని అతని భావమైయుండవచ్చును. అచ్చపు తెలుగుబడి నుడికారపు సొంపు కుమార సంభవంలో బాగా కనబడుతుంది. పండిత వర్గము వారు మాత్రము ఈప్రయోగాలను హర్షింపరు.

   శివకవులలో అత్యంతప్రసిద్ధుడు, బహుగ్రంధప్రణీత పాల్కురికి సోమనాదుడు.  మల్లికార్జున పండితారాధ్యుడు, యధావాక్కుల అన్నమయ్యకూడా శివకవుల్లో గణ్యులే; అయినా వారిరచనలు చాలా తక్కువ.  సోమనాధుడు  బసవపురాణము, పండితారాధ్య చరిత్రము, చతుర్వేదసారము, వృషాషిపశతకము, చెన్నమల్లు సీసములు, ఉదాహరణములు, రగడలు వంటి పెక్కు తెలుగు కృతులు వ్రాశారు.  వీటిల్లో మొదటి రెండు తెలుగు వాజ్మయంలో గొప్పస్థానం ఆక్రమిస్తున్నాయి. పాల్కురికి సోమనాధుడు కాక తిరుద్రదేవుని కాలము (క్రీ.శ.1158-95)వాడని కొందరు, ప్రతాపరుద్రుని కాలము వాడని (క్రీ.శ.1295-1328) కొందరును భావిస్తున్నారు.  రెండవ మతాన్నే పలువురు విశ్వసిస్తున్నారు.  దేశ-జాను తెనుగు-ద్విపద చందస్సు-ఈ త్రిపుటి విషయంలో సోమనాధుడు అపారమైన పట్టుదలగలవాడు.  ఇతివృత్తము, భాష, చందస్సు, అన్నీ కూడా దేశీయములుగానే ఉండాలనే దృఢదీక్ష కలవాడు.  వీరశైవమతాభిమాని అనడం చేత సాంఘిక్ ఆచారల్లోకూడా ఇతదు విప్లవవాదియే.  ఏది జాంతెనుగు అనే అంశంపై నిర్ధిష్టమైన నిర్వచనము-అనుష్ఠానము శివకవుల్లో కూడా కనబడడంలేదు.  మొత్తంమీద నన్నయ ప్రవేశపెట్టిన తత్సమ శైలికి కొంత భిన్నమైన మార్గము తత్కాలవ్యవహారానికి దగ్గరగా ఉండే భాషారీతి శివకవులకునూ, అందులో కొట్టవచ్చినట్లు పాల్కురికి సోమనాధునకును సమ్మతమని అతని మహాగ్రంధ ద్వయం వలనా మనము ఊహింపవచ్చును.  ఈతడు తన వృషాధిపశతకంలో ఒక పద్యము అచ్చ తెలుగులో వ్రాస్తూ దాన్ని జానుతెనుగు అన్నాడు.

           బలుసొడతోలు సీరమును బాపనరుల్ గెలుపారుకన్ను వె
           న్నెలతల సేదుకుత్తుకయు నిండిన వేలుపుటేరు పల్గుపూ