పుట:Sahityabashagate022780mbp.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

      సలుగలరేని లెంకవనిజానుదెనుంగున విన్నవించెదన్
      వలపు మదిన్ దలిర్ప బసవా, బసవా, బసవా వృషాధిపా '

    ఈ పద్యరచనను బట్టి జానుతెనుగుగంటే అచ్చతెలుగు కాబోలు అనే భావం ఏర్పడుతుంది.  కాని అది సరికారు.  తన మహారచనల్లో సమకాలిక వ్యవహారభాషము చాలా దగ్గరగా రావాలని ఎంతప్రయత్నం చేసినా సోమనాధుడు అచ్చతెలుగు  శైలి వ్రాయలేదు-నన్నయ, నన్నెచోడులు ఆదరించిన ఉన్నత సంస్కృత శైలిని విసర్ఝింపలేదు.

     "భవి కృతారంభ సంభవ ధాన్యనిచయ
     భవినిరీక్షణ రసపాకవితానస్
     భవిహస్తగత ఫలపత్రశాకాది
     భవిగృహ క్షేత్రాలఘ్రివధన వర్జితుడ
     భవిజన దర్శన స్పర్శనాలాప
     వివిధ దానాదాన విషయ దూరగుడ"

                          పండితారాధ్య చరిత్ర
   ఈ విధంగా గుక్క తిప్పుకోకుండా సంస్కృత సమాసాల్లో ఇతడు విహరించనూగలడు  తోచినప్పుడు చాల సులభ తేట తెలుగులోనూ పరుతెత్తగలడు.

       "బసవరోత్రుండను బసవనికరుణ
       బసవేశు శ్రీపాద పద్మసేవకాడ
       బసవన్నదూత, నే బసవన్న లెంగి
       బసవన్న యిలుపుట్టుబానిసకొడుక
       బసవన్న పన్నుల సన్నగావునను"
అందుచేత
      "ఆరూఢ గద్య పద్యాది ప్రభంధ
      పూరిత సంస్కృత భూయిష్ఠరచన
      మానుగా సర్వసామాన్యంబుగాదు
      జానుతెనుగు విశేషము ప్రసన్నతకు"
       

     అని ఇతడు చెప్పిన దానినిబట్టి తత్సమ శైలి పరిహరించడం ఇతని మతంగా అనుకోకూడదు.