పుట:Sahityabashagate022780mbp.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ముందుమాట

   ఎన్నోఏళ్ళుగా అనుకొంటున్న ప్రపంచ తెలుగు మహాసభలు జరగనున్న పర్వసమయం ఆసన్నమవుతున్నది. ప్రపంచంలోని తెలుగువారి ప్రతినిధులందరిని ఒకచోట సమీకరించవలసిన పెద్దలందరూ కన్నకలలు ఫలిస్తున్న శుభసమయమిది రాబోయే ఉగాది రెండువేల అయిదువందల సంవత్సరాల తెలుగుజాతి చరిత్రలో మరపురాని మధుర ఘట్టము కాగలదు.
   క్రీస్తుపూర్వం మూడవ శతాబ్దికి చెందిన శాతవషనరాజుల కాలంనుండి తెలుగు ప్రజలకు ఒక విశిష్టమైన చరిత్ర ఉన్నది. భారతదేశంలో తెలుగు మాట్లాడే ప్రజలు దాదాపు ఐదుకోట్లకుపైగా ఉన్నారు. హిందీ మాట్లాడేవారి తరువాత స్థానం తెలుగువారిదే బౌద్ధ పూర్వయుగంనుంచి ఇటీవల బ్రిటిష్ సామ్రాజ్య పరిపాలనయుగం వరకూ తెలుగువారు తమభాషా సంస్కృతీ సంప్రదాయాలను ఆయాజాతీయ జీవనవిధానాలతో మేళవించి, వాటిని సంపన్నం చేస్తూ ఉన్నారు.

ప్రపంచ తెలుగు మహాసభల ప్రధానలక్ష్యం తెలుగుప్రజల, తెలుగూభిమానుల ప్రతినిధులను ఒకవేదికమీద సమావేశపర్చడం. జతీయ, అంతర్జాతీయ సాంస్కృతిక రంగాలలోతెలుగువారు చేయవలసిన కృషినిగూర్చి చర్చించి, నిర్ణయయించుకోవడానికీ,తద్వారా వివిధ చైతన్యస్రవంతులను ఏకోన్ముఖుంచేసి మన సాంస్కృతిక సంబంధాలను ధృడతరం చేసుకోవడానికి ఈమహాసభలు దోహదకారులు అవుతవి. అంతేకాక ఈ మహాసభల ఆర్ధ్రమైన భావ సమైఖ్యతకు ప్రాతిపదికలై తెలుగుజాతిని సమైఖ్యంచేయగలవనీ, ఆవిధంగా జాతీయ అభ్యుదయానికి తోడ్పడగలవని విశ్వశిస్తున్నాను.

    1975 ఏప్రిల్ 12వ తేదీన తెలుగు ఉగాదిరోజున ప్రారంభమై ఒకవారం రోజులపాటు జరిగే ఈ మహా సభలలో వివిద దేశాలనుంచీ, వివుధ రాష్ట్రాలనుంచీ, యునెస్కోవంటి అంర్జాతీయ సంస్థలనుంచీ వచ్చిన ప్రముఖులు ప్రతినిధులుగానో, పరిశీలకులుగానో పాల్గొంటారు. ఈ మహాసభల సమయంలో చర్చాగోష్టులు, ప్రదర్శనలు, ప్రచురణలు మొదలైన కార్యక్రమాలు జరుగుతాయి. దేశ దేశాలలోని తెలుగు