పుట:Sahityabashagate022780mbp.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

a4. సాహిత్యభాషగా తెలుగు కిర్మ ధారయ సమాసంలో మువర్ణాంత శబ్దాలకు వచ్చే పంప్వా దేశం కూడా వేపూరు శబ్దంలో కనపడుతూంది. కావున ఇది తప్పక తెలుగు పదమనీ ఇటువంటివి ఎన్నో ఉండి ఉంటాయనీ, దేశ ప్రజలకు సులభంగా తెలియడానికై తెలుగు స్థల నామం ప్రయోగించారని చెవ్ప వీలవుతుంది. అప్పటికీ తెలుగు "గ్రామ నామాలు వాడుకలో ఉండే వన్నమాట. ఇంతకన్నా పూర్వ కాలానికి చెందిన ఒక పదము ఆమరావతీ స్తూప శిల్పాలమీద కనబడింది. ఇది 'నాగబు' అనే పదము. ఇప్పడు మనము ਕਹਾ నాగము (పాము) అనే శబ్దంయొక్క పాచీన రూపము, ఇందులో నాగ అనే సంస్కృత పదమూ, దాని మీద అమహ ద్వాచక పథమా భక్తి ఏక వచన ప్రత్యయ స్థానంలో "బు" వర్ణమూ కనబడుతున్నాయి. తత్సమములైన అమహద్వాచక శబ్దముల మీద మనమిప్పడు 'ము' వర్ణము వాడుతున్నాము. దాని స్థానంలో పూర్వకాలమున బు, దబు, మ్ము వాడే వారన్న మాట. నాగబు, నాగంబు, నాగమ్మ, నాగము క్రమంలో ఈ పత్యయం పరిణామం చెందినది. నాగబు అనే రూపం తప్ప తక్కిన మూడు రూపాలు మనకు కావ్యాల్లో లభిస్తూనే ఉంటాయి. వనంబు, వనమ్ము, వనము కూడా ఇటు వంటిదే. అప్పటికే మహదమహద్వాచక හීන්ට చెయ్యడం, వాటిల్లో అమహ ద్వాచకాల మీద వచ్చే ప్రత్యయము మనకు దొరికాయి. ఇంకా ఎన్నో దొరికి ఉండు ననడం తధ్యము. శాసన లేఖకులకు అవసరం పడలేదు. తెలుగు వాక్య రచన ఉన్నట్లు నిదర్శనం ఇంకా లభింప ඒක. ఉత్తరోత్తరంగా ఈ క్రమమే సాగింది. క్రీ. శ. 1వ శతాబ్ది నుండి 8వ శతాబ్ది మధ్య వరకూ తెలుగు వాక్య రచన ప్రత్యక్షం కాలేదు. ఈనాడుమ వెలసిన ప్రాకృత శాసనాల్లోను, సంస్కృత శాసనాల్లోను గ్రామ నామములు, మనుష్య నామ ములు. బిరుదు పదములు వంటి كة فيكة రూపమ లు, తెలుగు శబ్దములు అని చెప్ప దగినవి బహుళ సంఖ్యలోనే కనబడుతున్నాయి. గ్రామ నామాల చివర-ఊరు, పట్టు పట్టః పాక, కొండ, చెరువు వంటి పదాలు కనబడతాయి. ఒక విశేషమేమిటంటే తెలుగు వర్ణమాలలో మనకు ఇప్పటికే పరిమితమైన శకట రేథము లేక బండి 'అ' ఈ మాటల్లో వస్తూంటుంది. సంస్కృతంతో పోల్చినప్పుడు తెలుగునకు పత్యేకమైన ధ్వనులు ఏవంటే ఎ, ఒ, చ, జి. అ. అని చెప్పుతున్నాము. ఇవిగాక ఈ ప్రాచీన కాలంలో తెలుగు పదాల్లో 'ఆ' అనే ధ్వని ఒకటి క్రొత్తగా మనకు తగులుతుంది. ఇది కొన్ని శతాబ్దాల దాకా తెలుగులో నిలిచి ఉండి నన్నయ సమీప కాలంలో కాబోలు భాషలో నుంచి నిష్కమించింది. నన్నయ భారతంలో ఈ ధ్వని