పుట:Sahityabashagate022780mbp.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

టికి లభించిన దాని కన్న దృఢతర సాక్ష్యం లభించే దాకా నన్నయ భారతమే ఆది కావ్యము అని ఒప్పకోవాలి. ఆయితే వసు చరిత్ర కారుడు "మహిమన్ వాగను శాసనుండు సృజియింపన్" ఆనే పద్యంలో చెప్పినట్లు నన్నయ ఆది కవియా? ఆంతకు ముందు తెలుగు కవులు లేరా? తెలుగు కవిత్వం లేదా? అంటే ఉన్నదనే సమాదానం చెప్పాలి. ఆరంబంలోనే ఒక చిన్న క్షమార్పణ రామరాజ భూషణునికి చెప్ప వలసి ఉంది. వాగనుశాసనుడు ఆనగా నన్నయ భట్టు ఆంధో క్తిమయ ప్రపంచాన్ని సృష్టించినట్టు రామరాజ భూషణుడు చెప్పాడని అర్థం చేసి ఆ మహాకవిని తరుచు భాషావేత్తలు విమర్శిస్తూ ఉంటారు. ఎంత మహాకవియైనా భాషను సృష్టించ గలడా రామరాజ భూషణునకు భాషా తత్వం తెలియదని అంటూంటాము. ఇదొక విధంగా ఆ మహా కవికి (వను చరిత్ర కారునికి) అన్యాయం చెయ్యడమే ఆవుతుంది. ఎందు కంటే రామరాజ భూషణుడు తెలుగు భాషా చరిత్ర వాయడానికి పూనుకోలేదు. ఒక వేళ పూనుకొన్నా ఈ కాలంలో మనకు లభించే విమర్శాత్మక సాధనాలు ఆయనకు ఆందుబాటులోనూ లేవు. "వ్రమాదోధిమతా మపి' అన్నట్లున్నూ సాధనా భావం చేత నున్నూ ఆంధో క్తిమయ ప్రపంచంము నన్నయతో మొదలైందని ఆతడు ప్రాసినా క్షంతవ్యమే అవుతుంది. వాస్తవానికి ఆతడు వట్టి ఆంద్రో క్తి మయ వ్రపంచము అనలేదు. ఈ బహుళాంద్రో క్తి మయ ప్రపంచమున 'దత్ప్రాగల్భ్య మూహించెదన్' ఆని వ్రాసినాడు. అతని దృష్టిలో ఉన్నది సాహిత్యో ప్రయోగియైన బహుళాంద్రోక్తి మయ ప్రపంచము. నిజంగా నన్నయ భారతానికి ముందు ఈ బహుళాంద్రోక్తిమయ పపంచము లేదు. దానికాతడే చాల వరకూ రూపకల్పన చేశాడు. ఈనాడు మనము కూడా ఆదే భావిస్తున్నాము. అందుచేత వసుచరిత్రకారుని తేలికగా విమర్శించడం న్యాయం కాదు. ఆదియట్లండె.

నన్నయ భట్టారకునకు ముందుడిన ఆంధోక్తిమయ ప్రపంచ మెట్టిది, దాని నాతడు సాహిత్య ప్రయోజనాలకు ఉపయోగపడేటట్లు ఎట్టా బహుళాంధ్రోక్తిమయ ప్రపం చంగా తీర్చిదిద్దాడు అనే పశ్నకు సమాధానం ఆరయాలి. తెలుగు భాష ఎంత ప్రాచీనమైనది అనే విషయంలోనే ఆభిపాయ భేదాలున్నాయి. ఏమయినా సాత వాహన యుగాంతమునకు తెలుగుభాష ఆస్తిత్వంలోకి వచ్చింది. నాల్గవ పులుమావి జంగ్లిగండు శాసనంలో వేపూరు శబ్దం వచ్చింది. ఇది క్రీ.శ. మూడవ శతాబ్ది పారంభము, వేపూరు అనేది వేపచెట్ల ఆధికంగా గల గామము " అని అర్థంచేస్తే ఇందులో మేము ఊరు అనే రెండు తెలుగు పదాలు స్పష్టంగా కనబడుతున్నాయి.