పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

55 రక్తపాతము

కాన్పించును, "వెనిసు వర్తకుడు" (merchant of venice) నాటకమందు కత్తిపోటుచేతనే కసియు గౌరవమూ కడతేఱు చుండును. నాటకములు కసాయిఖానాలు చేయుట పాశ్చాత్యుల సనాతన ధర్మమా? అట్లనరాదు. యూరపునందు కూడా శిష్టానుసారము అట్టిపని జుగుప్సాహర్‌ముకాని ప్రశంసనీయముకాదు. సురుచిసంపన్నుడూ సుప్రసిద్ధుడునగు Addison అను విమర్శకుని అభిప్రాయము వినండి : -

Among all our methods of moving pity or terror, there is none so absurd and barbarous, and which more exposes us to the contempt and ridicule of our neighbours, than that dreadful butchering of one another, which is so frequent upon the English stage. To delight in seeing men stabbed, poisoned, racked, or impaled, is certainly the sign of a cruel temper; and as this is often practised before the British audience, several French critics, Who think these are grateful spectacles to us, take occasion from them to represent us as a people that delight in blood. It is indeed very odd to see our stage strewed with carcasses in the lost scenes of a tragedy, and to see in the wardrobe of the play-house several daggers, poniards. Wheels, bowls for poisin and many of the instruments of death."

కరుణయు భయమును కల్గింపవలెనన్న మన కనేక సాధనము లున్నవి. అందు భయానకహత్యాకాండ మొకటి. దానిని మన (ఆంగ్లేయ) రంగస్థలమున తరుచుగా ప్రదర్శించు చున్నారు, కాని అది కడునిష్ఠురము, అసభ్యము. దాని మూలమున ఇరుగు పొరుగు జాతులవారిచే మనము ఘృణితులమై