పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

54 సాహిత్య మీమాంస

దారుణమగు హత్యాపరంపరను అనుతాపము మరుగుపరచ గలదా? కొత్తనీరు పాతనీటిని గొనిపోవునట్లు రక్తప్రవాహ సంసర్గమున అనుతాపబాష్పస్రవంతి కలకబారి హత్యకాండమునకే అంతగౌరవము నాపాదించును. అంతట వ్యాపించి యున్నది హత్య, ఆచ్చటచ్చటా పొడచూపునది అనుతాపము; ఇది అంతరించుట అబ్బురముకాదు. మానవ హృదయముల మచ్చికచేయుటకు హత్యాకాండము పెట్టు మచ్చుమందు ఆ యనుతాపము!

షేక్స్‌పియరు ప్రసిద్ధ నాటకములందెల్ల బీభత్సజనక మగు నీహత్యావ్యాపారము ఆవిర్భవించియే యుంది. హేమ్‌లెట్ నాటకమున తుదియంకము కసాయి కొట్టమే. రిచర్డ్ నాటకములు, జాన్, లియర్, కొరొయొలేనస్‌ ప్రభుతులన్నీ రక్తాక్తాంతములు-జూలియస్‌సీజర్ నందలి (Beware the ides of March) అను హెచ్చరిక సీజరు మరణా నంతరమున గుండె దిగులువెట్టును. ఈనాటకములందు కరుణరస మేదీ? మేక్‌బెత్ పేరు విన్నతోడనే ఇప్పటికీ ఒళ్ళు జలదరించునే! మూడవ రిచర్డ్ నాటకమందు రోత ముమ్మరించును. అది చదివినా రంగస్థలమున చూచినా ఇక వియోగాంతములజోలికి పోరా దనిపించును.

రక్తపాతము, విదేశీయ రుచులు

ఖడ్గవ్యాపారము షేక్స్‌పియరు వియోగాంతము లందే కాక ఆతని సంయోగాంతముల (Comedy) యందుకూడా