పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

29 ఆదర్శము

సహజము - సావిత్రి, సీత, దమయంతి, శకుంతల, ఉత్తర, డెన్‌డెమొనా, కాన్‌స్టెన్స్, ఒఫీలియా, పాండవులు, లియర్ మొదలగువారే ఇందుకు ప్రమాణము. వియోగాంతనాటకముల సంకీర్ణక్షేత్రము పాపపూరిత నరకకుండము; అందు పాపము కాలక్రమమున భయావహయై దుర్నిరీక్ష్యావస్థల బొందుతుంది; దాని చిత్రించుటకు కావలసిన ఉపాయము లన్నియూ అందు సంచితములగును - అటులనే పుణ్య మేయే అవస్థలయం దేలాగు విజృంభించునో చూపడమున కందవకాశము లేదు. లియర్‌నాటకమున ఇట్టి రచనకు వీలులేక పోవుటచే నిగృహీతుడైన కథానాయకు డొకడే దయకు పాత్రుడయ్యెను. ఒకవంక కార్డీలియా ఇంకొకవంక నామె అక్కలు - వీరి జీవితవైషమ్యములు నిరూపించుటకే రాజుగారి పాత్రము కల్పించబడింది. శ్రీరామయుధిష్ఠిరుల చరితము లెట్టి దురవస్థయందున్నూ తామరమొగ్గలవలెవికసించి క్రమముగా స్ఫూర్తివహించి ఉన్నతధర్మాదర్శముల కునికిపట్టులై శాంత రసమును ప్రసరింపజేయును. అట్టి ఉపాయసంచయము ఆర్యసాహిత్యాంతర్గత మహాకావ్యములయం దమరింది. కాని వియోగాంత నాటక సాహిత్యమున నట్టి దనువుపడదు. దుష్యంతుడు ధర్మానురక్తిని శ్రీరామధర్మతనయుల కోడి పోవును. షేక్స్‌పియరు నాటకములందే కాక ఇతర ఆంగ్లసాహిత్యగ్రంథములందున్నూ ఇది అసంభవ మాయెను. లాటిన్ గ్రీకు సాహిత్యములందు కూడా ఇట్టి చిత్రములు మృగ్య