పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

23 ఆదర్శము

మిల్టన్ సైతాను పాత్రమువలె వాటి విశాలత, ఉన్నతి, గాంభీర్యమూ మన హృదయములందు వెరగు విస్మయమును పొడమజేసి అనురాగము నంకురింపజేయుటచేత పూర్ణభావమున దానియెడ రోతపడము. ఎందుకంటే పైనుదహరించిన గుణసమృద్ధిచేత ఆపాత్రయందు లేశమైనా అనురక్తియు, సానుభూతియు ప్రభవింపకతీరవు. దానిని జూచి యెంత రోయుదా మనుకొన్నా చిత్త మాదెసకే పారుచుండును. పాపకలిత మని మన మెఱిగినా ఆపాపము మన కగుపడదు. అలౌకికపుణ్యచిత్రముల కీమచ్చయుండదు. పుణ్యచిత్రము స్వాభావికముగా మనోరంజకము, అందద్భుతరసము మేళవించినచో ఫలము ద్విగుణించును. అట్టి చిత్రమును జూచి యానందించువారు అది లౌకికమో అలౌకికమో చర్చింపనేలేరు. తత్పవిత్రాంబుధిపుణ్యవీచికల దూగుచూ, తద్దివ్యకథాసుధారసము గ్రోలుచూ, ఆశ్చర్యవిహ్వలత వారి మానసములు తథ్యమిథ్యావివిక్తిని కోలుపోవును. ముగ్థుల కట్టి వివేక ముండునా? తత్పవిత్రగంగాప్రవాహమున సంశయపంకము తుడుచుకొనిపోవును.

కామక్రోధాదులు పశువృత్తిబీజము లనియూ దయా దాక్షిణ్యాదులు దైవీప్రవృత్తిబీజము లనియూ చెప్పినాము కదా? మొదటివి చేర్చి రచించిన అద్భుతకల్పన ఆసురము, రెండోవి జేర్చి రచించిన అద్భుతకల్పన దైవీకల్పన. పాశ్చాత్యసాహిత్యమున ఆసురసృష్టి సమృద్ధిగా నున్నందున దాని ఆధి