పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

22 సాహిత్య మీమాంస

జీవితము లూరూ పేరూ లేక నశించును, వారచిరకాలమున మరపు వత్తురు. ఎప్పుడూ కన్నులయెదుట నుండే వాటికి చిత్తాకర్షణశక్తి యలవడదు - "అతిపరిచయమున అవజ్ఞ" అనన్యసమానులు, అద్భుతవ్యక్తులున్నూ చిత్తము నాకర్షించి అందు నెలకొని స్మృతిపథమునుండి త్వరలో తొలగరు. కవుల సృష్టిలోనివా రిట్టివారే, కావున తత్సృష్టి అద్భుతావహ మగును. ఇట్టి అద్భుతవ్యక్తులను చిరస్మరణీయుల చేయడముకోసము కవులు తమ రచనయందు ప్రకృతిసీమను కొంచెము దాటవలసి వచ్చును. అంతట నాచిత్రములకు అలౌకికత అలవడును. మేక్‌బెత్ రాణి యిట్టి అలౌకిక చిత్రమున కొక దృష్టాంతము. ఒథెలో, రిచర్డ్, గోనరిల్, జాన్ మొదలగు పాత్రము లన్నియూ ఇట్టివే. ఇట్టి యమానుషకల్పనలు మహాకావ్యములం దావశ్యకములు; అత్యంతాద్భుతములు కాకపోతే అవి చిరస్మరణీయములు కాలేవు.

మిల్టన్ రచించిన సైతానుపాత్ర మత్యంతాద్భుతరసపూరితము కావుననే కల్పనాజగమున సర్వాధికారము చలాయిస్తూన్నది. ఆదము అవ్వల సరళతయు పవిత్రతయు నద్భుతములే. అతడు రచించిన నరకచిత్ర మత్యద్భుతమూ సువిస్తృతమే కాని ఆతని స్వర్గసృష్టికిమాత్ర మాగుణ మబ్బలేదు; అందుకే ఆస్వర్గముకన్న ఆనరకమే చిరస్మరణీయమైంది.

అమానుషిక పాపచిత్రములం దొక దోష మంది.