పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

19 ఆదర్శము

లను రచించెను. కాని అవి ఉజ్వలరూపమున పెంపొదక పోవడముచేత అసురచిత్రములను మించలేకపోయెను. మేక్‌బెత్ కు ప్రతిగా మేక్‌డఫ్ బాంకోలున్నారు, కాని వారసమర్థులు - రిచర్డ్, జాన్ మొదలగువారికి ప్రతియోగులే లేరు. కావున ఆనాటకములందు ఆసురిక చిత్రములు ప్రబలమై తత్ప్రతియోగి చిత్రముల నడగ ద్రొక్కినవి. *[1]

పుణ్యాదర్శముల ఆవశ్యకత, ఉత్కర్ష -

గహ్యన్‌మైనపాపమూర్తి తద్భీషణపరిణామమున్నూ ప్రత్యక్షమయ్యేటట్లు రచియించి మానవుల దుర్మార్గదూరుల జేయు నుపాయ ముత్తమము గనుక ఐరోపీయ వియోగ నాటకముల యందలి ఆసురసృష్టిని కొంతవరకూ సమర్థింప వచ్చును. అలాగే కానీ. వాటిమూలమున పాప మెంతవరకు నివారింపబడినదను వాదమును విడిచి వియోగాంతనాటకములు చదివి రంగస్థలముపై వాటిని చూడడమువల్ల మంచి ఫలము చేకూరుననే ఒప్పుకొందాము. అంతమాత్రనా ఏమగును? మానవులను పాపమార్గమునుండి నివృత్తుల జేసినంతమాత్రమున పూర్ణసిద్ధి అయిందా? వారి చిత్తముల యందలి పరమార్థక్షుధను పరిమార్చ నక్కరలేదా? పార

  1. * ఇది లోకమర్యాదననుసరించి చేసిన సృష్టిగాని లోకోత్తరము కాకాలదు - సర్వ సాధారణముగా అధర్మమునకు ధర్మమూ పాపమునకు పుణ్యమూ అసురులకు దివ్యులూఅణగియే యుందురు. పాపజీమూతము ధర్మకాంతి నాచ్ఛాదించును.