పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

10 సాహిత్య మీమాంస

యెంచబడెనో ఆమాలిన్యమాతని రచనయందు గన్పట్టవలెను. కాని ఆతడు కేవలానుకారికాడనియు సృష్టికర్తయగు మహాకవి యనియు చెప్పియుంటిమికదా, అతని సృష్టియెట్టిదో పరిడీలింతాము.

ప్రాచ్యపాశ్చాత్యకవుల సృష్టిలోని భేదము.

జనసమాజమును తుత్తునియలుగ చేసి పర్యవేక్షణ మొనర్చి దాని ప్రకృతరూపమును ప్రతిబింబింప సమకట్టువారి కందలి దోషములే ఎక్కువ పొడగట్టును. ప్రపంచమునకు సద్బోధ మొనర్చువారిలో కవి యొకడు, కావున జనసంఘ మందలి పుష్కలదోషభావములను తగ్గించి సత్వగుణమును సంక్రమింపజేయు ప్రక్రియల నిర్ణయించి వాటిని తన బోధనచే జగమున వ్యాపింపజేయువాడే మహాకవి; కావుననే కవులు జగద్గురులని భావింపబడుచున్నారు. ఈయుపాయోపదేశమున ప్రాచ్యులకూ పాశ్చాత్యులకూ చాలాభేదమున్నది. ఆకవుల సృష్టి వారివారిబోధన కనుగుణముగ నుంటుంది, కావున సృష్టి మూలమున బోధనజేయుటలో - "ప్రాచి ప్రాచి, ప్రతీచి ప్రతీచి" అను కవివాక్య మన్వర్థము. పాశ్చాత్యులు సృజించిన తీరున ప్రాచ్యులు సృజింపలేదు. ఒకరు సంఘమందలి రజస్తమోగుణముల నుజ్వలరీతిని గన్పరచి వాటి ఫలములు ఘోరణయానకము లని దృష్టాంతములతో వర్ణింప, ఇంకొకరు సత్వగుణమును సముజ్వల రూపమున చిత్రించి దాని నవలంబించినవారి జీవితము సుఖాగారమౌనని దృష్టాంతములతో