పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

9 ఆదర్శము

యుండుట చేతనే మానవప్రకృతి మిశ్రప్రవృత్తి సంఘటిత మయింది.

క్రైస్తవమత సిద్ధాంతములు మానవులయందు పాపాంశ మెక్కువగానున్నదని ఘోషిస్తూన్నవి. "జనసమాజమందు ప్రాయికముగా పాపాంశమెక్కువగానున్నది. శ్రేష్ఠగుణములు తక్కువ, తామసిక రాజసిక ప్రవృత్తులు బలవత్తరములు, అందుచే చాలామంది నిర్మలచరిత్రులుకారు" అని వాటి వాదము. అందుచేత ఆసామాజిక చిత్రములూ వ్యక్తి చిత్రములూ రచించు కవులు ఆరెండు గుణములకూ ప్రాధాన్య మివ్వవలసి ఉంటుంది. అట్లుచేయకున్న ఆచిత్రములు వారి మతధర్మానుసారము తత్తుల్యములు యథార్థములును కానేరవు. కావున ఐరోపీయకవివరేణ్యుల చిత్రములయం దాయా జాతులయం దెట్టి గుణవిశేషములుండునో వాటియందు రజస్త మోగుణంబులెట్లు వికాసముచెందెనో తెల్పబడును. షేక్స్‌పియర్ రచించిన చిత్రములు ప్రకృతికి యధార్థప్రతిబింబములే ఐనచో పాశ్చాత్యమానవవ్యక్తిప్రకృతియందూ జనసంఘము నందూగల ఆలోకాంధకారములు దోషములున్నూ వాటి వాటి పరిణామమున ప్రతిబింబితములై యుండితీరును; హెచ్చు తగ్గు లుండనేరవు అనగా యూరోపీయ జనసంఘములందును తల్లోకచరిత్రమందును విశిష్టదోషము లేతీరున నుండునో వాటికి షేక్స్‌పియరు రచన ప్రతికృతియై యుండును. ఆ మత సిద్ధాంతముల చొప్పున మానవ ప్రకృతి ఎంతపాపకలితమని