పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

125 మానవప్రేమ

రించి విరాజమానుడు కావలసినవాడు అయోధ్యకు రాజు కాగోరునా? భ్రాతృభక్తిభరమున నతనికి మానుషత్వము తొలగి దివ్యత్వము సిద్ధించెను.

కచుని సంయమము కనండి. మృతసంజీవినీవిద్య నభ్యసింప నాతడు శుక్రాచార్యునొద్ద శిష్యుడుగాచేర ఆచార్యుని కూతురగు దేవయాని అతనియందు బద్ధానురాగ అయింది. ఎప్పుడు నొకచోట నుండుటచే ఆతనియెడ నామె రూపగుణ ముగ్ధయై నాల్గుసారు లాతని పునర్జీవితుని చేసింది; అప్పటికీ ఆతడు మరులుకొనలేదు. ఆమె తన్ను వలచినదని ఎరిగియూ గురుపుత్త్రికగాన నామెయెడ సోదరీభావ మూనియుండెను. విద్యాపూర్తి యైనతోడనే ఆతడింటికి మగుడ నుద్యుక్తుడగు నప్పుడు ఆమె మోహము నాపుకొనలేక వెల్లడించినా కచు డామె నొల్లడాయె. ఆదినుండియు నాతనియం దాత్మసంయమ మగుపడుచుండెను. ఆతడు ప్రత్యాఖ్యాన మొనర్చినపిదప దేవయానియం దాశక్తి ఆవిర్భవించింది.

చంద్రుడు, తార, ఇమోజిన్, హెలెనా, డెస్‌డెమొనా, జూలియట్ మొదలగువారియందు లేని ఆత్మనిరోధము కచ దేవయానుల చరిత్రములను దివ్యసౌందర్యకలిత మొనర్చెను. తద్దీప్తిచే ఇంద్రియలాల సాంధకార మంతర్ధానమాయెను. ఇట్టిదివ్యచిత్రములు పాశ్చాత్యసాహిత్యమున లభింపవు దేవత్వము పశుత్వమును శాసింపనేరదు; అట్టిసామర్థ్యము ఇంద్రియనిగ్రహమునకు మానుషత్వమునకు మాత్రమేఉన్నది.