పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

111 పాశవప్రేమ

ఫెర్డి - అఖిల దేవతలు పృథ్వియు సాక్షులుగా శపథ మొనర్చి చెప్పుతూన్నాను. నేను నిన్ను ప్రేమించుటే కాదు, కులీనవలె సమ్మానింతును, గౌరవింతును.

మిరా - నవ్వు రాదగినచోట నా కేడ్పు వస్తూన్నదే!

ఫెర్డి - కారణ మేమి?

మిరా - నాహీనత దీనతయు తలంచి ఏడ్చు చున్నాను. నే నీయదలచినదానిని ఇవ్వజాలను. (నీవు స్వీకరింతువనే ఆశ లేదు) నాకేది లభించకున్న నేను జీవించనో దానిని నీ విచ్చెదవో లేదో? (ఇచ్చెదవనే ఆశ లేదు) అందుకే ఏడుపు