పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

110 సాహిత్య మీమాంస

చారమై యున్నది. యువకులు వివాహభారమును తమ నెత్తుల కెత్తుకొనకుంటే ప్రణయాఖేటనాచారమునకు అవసర ముండదు. ప్రేమ క్రయవిక్రయసామగ్రి కానేరదు. అప్పుడు స్త్రీలకు లజ్జయే నిసర్గభూషణ మయి వారు జాతికీ సంఘమునకూ ఖ్యాతి తెచ్చెదరు. ఇట్టిశీలమే శకుంతలకు కల్పింప బడినది.

శకుంతల - మిరాండా

నాగరికప్రపంచముతో నెట్టిసంసర్గమూ లేక నిర్జనమగు ఋష్యాశ్రమమున శకుంతల పెరిగినట్లే, మిరాండాకూడా జనశూన్యారణ్యమున జనకునిచే పోషింపబడెను. శకుంతలహృదయమున ప్రేమోద్రేక ముదయించు ప్రాయమున దుష్యంతు డామెకంట బడెను. ఆమెకప్పు డుదయించిన ముగ్ధత్వము లజ్జనుగూర్చి ముచ్చటించితిమి. మిరాండా తండ్రినితప్ప ఇతరులనుచూడనేలేదు; కాని ఫెర్డినెండ్ ఆమెకంట బడడముతోనే ప్రౌఢనాయకివలె మాటలాడుటకు మొదలుపెట్టింది! శకుంతలను చూచిందిమొదలు రాజే భోగట్టాఅంతా కనుక్కొని వివాహప్రసంగము చేసెనుగాని ఆమె ఆసంగతి యెత్తనేలేదు.

ఇక మిరాండా వృత్తమును పరికించండి : _

  • [1]మిరా - నాపై నీకు ప్రేమ ఉన్నదా ?
  • * Mir - Do you love me? Fer - O heavenǃ O Earth bear witness to this sound, Beyond all limit of what else in the world, I Do love, prize, honor you. Mir - I am a fool To weep at what I am glad of. Fer - wherefore weep you ? Mir - At mine unworthiness. that dare not offer What I desire to give; and much less take What I shall die to want, But this is trifling; And all the more it seeks to hide itself The bigger bulk it shows - Hence, bashful cunningǃ And prompt me, plain and holy innocenceǃ I am your wife, if you will marry me; If not, I'll die your maidː to be your fellow You may deny me, but I'll be your servant Whether you will or no. Fer - My mistress, dearest; And I thus humble ever. Mir - My husband, then ? Fer - Ay, here is my hand. Mir - And mine, with my heart in it. (Tempest Act III)