పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

40. సాహిత్య మీమాంస

కావ్యమున యథేచ్ఛముగా జొన్పవచ్చును, కాని దృశ్య కావ్యములం దట్టివి కూర్చరాదు. రంగస్థలమున కత్తివ్రేటులు కల్పించినచో చూపఱకు ప్రీతి జనింపదు సరేకదా, ప్రమాదములుకూడా ఘటిల్లవచ్చును. ఇట్లే శ్రవ్యకావ్యములకన్న దృశ్యకావ్యములందు ఎక్కుడు నియమములు పాటింపవలయును.

కేవల పఠనముననే ఆనందజనకమగుదానిని కార్య క్షేత్రమున అభినయిస్తే కథ కన్నులకు కట్టును గాని ఆనందము అంతగా కలుగబోదు, కావున ఆనందోదయమునకు విఘ్న మొనర్చు కార్యముల నాటకకర్త లతిజాగరూకతతో విడువ వలయును. శిష్టాచారములకు విరుద్ధములు, సహృదయుల రుచులకు ప్రతికూలములు, లజ్జావహములు నగు కార్యములు నాటకకవులు త్యజింప వలయును. ఇట్టి వాటిని "సాహిత్య దర్పణ" కారు డొక్కచోట చేర్చెను: -

               దూరాధ్వానం వధో యుద్ధం రాజ్యదేశాదివిప్లవ:
               వివాహో భోజనం శాపోత్సర్గౌ మృత్యు రతి స్తథా
               దంంతచ్ఛేద్యం నఖచ్ఛేద్య మన్య ద్ర్వీడాకరంచయత్
               శయనాధరసానాది నగరాద్యుపరోధనమ్
               స్నానానులేపనేచేభి ర్వర్జితో నాతివిస్తర:||

ఈశ్లోకములభావము సుగమము కావున నిట విస్తరింప పనిలేదు. ఆర్యలాక్షణికులు నాటకములయందు హత్య నిషేధించిరి. రంగస్థలమున అది ప్రదర్శించిన నెవరి కానంద ముదయించును ? అంతే కాదు, వెగటుకూడా పుట్టును, కొన్ని