పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

39 రక్తపాతము

ఏదైనా విశిష్టాభీష్టార్థ ముండిన పదావళియే కావ్యమునకు శరీరము కాదగునని దండి మహాకవి చెప్పెను. అభీష్టము లేక ఏకార్యమూ మొదలుపెట్టము. ఆయభీష్టము విశిష్ట మైనచో అందుకు తగిన పదచయమును కవి కూర్పవలయు నని మహాకవి దండి అనుశాసనము. అభీష్టార్థ మెట్టి దంటే "సహృద హృదయవేద్యోర్థ: -" పండితులహృదయము లెరుగ దగినది. కావ్యమునకు రెండులక్షణము లుండవలెను - మొదట అది ప్రీతి కలిగింపవలెను; పిమ్మట ఇష్టార్థసిద్ధికి సాధనము కావలయును. ఎవరియిష్టము? సహృదయులది. సహృదయు లెట్టివారు? సురుచుసంపన్నులు, కావ్యరసాస్వాదనసమర్థులు; వీరే విద్వాంసులు. ఇందుకే కాళిదాసు -

"ఆపరితోషా ద్విదుషాం నసాధు మన్యే ప్రయోగవిజ్ఞానమ్"

తలప నాదుప్రయోగకౌశలము నుంచి|దంచుపండితుల్ సంతోషమందువరకు

అని చెప్పెను.

కావ్యము శ్రవ్య మైనా దృశ్య మైనా రసమును పుట్టించ వలెను. లోకుల రుచులు భిన్నములు కావున కావ్యముల నేకరీతుల రచింప బడవలయును. శ్రవ్యకావ్యము పఠనమునకు వినుటకును నిర్మింపబడినది, కావున సురుచిసంపాదనమున దానికి కావలసినంత స్వేచ్ఛ కలదు. దృశ్యకావ్యమునం దా స్వాతంత్ర్యము చెల్లుబడికాదు. దృశ్యకావ్య మభినయింపదగినది కావున తన్మూలమున ఆకావ్యమునకు జీవము పోయవలెను - యుద్ధము, రాజ్యవిప్లవము, కొట్లాట మొదలగునవి శ్రవ్య