పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

41 రక్తపాతము

వేళల రోతాయు రోషమూ జనించును. అందుచే నాటకములోని హత్యకు తోడు బయటకొట్లాటలు జరుగును. హత్యా విడంబనము ఉద్వేగజనకము కావడముచేత దానిని కన్నులార గాంచినచో ఎవరు ధైర్యము చిక్కబట్ట గల్గుదురు?

షేక్స్‌పియరు రవించిన ఒథెలోనాటకమందలి యీ దృశ్యమును పరికింపుడు : -

  • [1]డెస్‌డెమొనా..........నాథా, నన్ను వెడల గొట్టుము, చంపవద్దు.

ఒథెలో.............చాల్చాలు - జారిణీ!

డెస్...............రేపు చంపుము, ఈరాత్రి ప్రాణములతో నుండనిమ్ము.

ఒథె.............లేదు. అడ్డుచెప్పితివా -

డెస్...............అరగంటసే పోర్చుము.

ఒథె...............అంతలో నేమగును? ఇప్పు డాగను.

డెస్..............ఒక్క సారి దేవుని ప్రార్థింప నిమ్ము.

ఒథె..............ఇప్పటికే జాగయ్యె...........(నులిమిచంపును.)

  1. *Desdemona.......O,banish me, my lord, but kill me not. Othello...........Down, Strumpet ǃ Desdem..........Kill me tomorrow, let me live tonight. Othello..........Nay, if you strive' -