పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

8 సాహిత్యమీమాంస

(Comedy) రచనయందున్నూ అతడు సిద్ధహస్తుడే, అంతవాడు ఐరోపీయ కవివరులలో లేడు.

జగద్విదితములు సర్వమాన్యములగు నాతని వియోగాంతనాటకములే విమర్శింతాము. మానవప్రకృతిని చిత్రించుటలో నాతడెంతవరకు కృతకృత్యుడాయెనో, అన్ని విషయముల నాతడు సఫలీకృతుడాయెనో లేదో చర్చింప తల పెట్టలేదు. తత్ప్రకృతి చిత్రణమున నాతడనన్యసామాన్యప్రజ్ఞావంతుడని మొదటనే చెప్పితిమి. ఆతని కౌశలమును ప్రశంసిస్తూ విమర్శకు డొకడిట్లనియె -

                      O Natureǃ O Shakespeareǃ Which
                            of ye drew from the other?
                         ప్రకృతిదేవత! షేక్స్‌స్పియ! ర్పలుకరాదె?
                         ఎవరెవరికి ప్రతిబింబ మిట్టి సృష్టి?

మానవప్రకృతిని తత్తుల్యరూపమున చిత్రించినాడు గాన ఆతని చిత్రములెట్టివో పరిశీలింతాము. ఈప్రకృతి గుణావగుణ సంకలితమని అందరెరుగుదురు. ఇందు పశుత్వమూ, మానుషత్వమూ, దేవత్వమూఅని మూడుప్రవృత్తులున్నవి. ఆహారము, నిద్ర, రోగము, శోకము, కామక్రోధాద్యరివర్గముతో కూడియుండుటచే మానవుడు పశుతుల్యుడు; బుద్ధి, విద్య, వివేచన, మొదలగు శక్తులచే సంపన్నుడగుట నాతనికి మానుషత్వము సిద్ధించెను; దయ, దాక్షిణ్యము, భక్తి మొదలగు గుణవిభూతి గల్గుటచే నాతడు దేవసమాను డవుతున్నాడు. ఈమూడు గుణములు - తమస్సు, రజస్సు, సత్వము కలిసి