పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

7 ఆదర్శము

ములను పఠించుటచే నెట్టిభావము లుత్పన్నములవునో యిందు వివరింపబడును.

మానప్రకృతి - షేక్స్‌పియర్.

పాశ్చాత్య జగమునందలి జనసంఘముల యొక్కయు మానవ వ్యక్తులయొక్కయు ప్రవృత్తులు అద్వితీయప్రతిభతో చిత్రించిన మహాకవి షేక్స్‌పియర్. అచ్చటి ఆచారవ్యవహారములు రీతినీతులు మొదలుగాగల విషయములను పురస్కరించుకొని ఆతడు రచించిన సజీవచిత్రములు ప్రశస్తములు, యథార్థములు, మర్మోద్ఘాటనము లగుటచే రూపగ్రహణయంత్రమున(Photographic Camera) తీసిన పటములవలె తోచును. అతని నాటకములందలి పాత్రములన్నియు సజీవములు, అట్టి చిత్రణ మసాధారణశక్తి కలితమనుట అతిశయోక్తికాదు. ఆకవి కీర్తి యంతయు వియోగాంతనాటకము (Tragedy)*[1]ల యందు నిక్షిప్తమై యున్నది. అందాతని అలౌకికప్రజ్ఞ విశదము కాగలదు. ఆతడు కేవల చిత్రకారునివలె అనుకారికాక, జాజ్వల్యమాన సృష్టివిభవ సంపన్ను డనికూడా స్పష్టమగును.

ఆనాటకములు కావ్యనాటక రసనిష్యందములూ సృష్టి చాతుర్య ప్రదర్శకములూ అగుటచేతనే పాశ్చాత్య సాహిత్య గ్రంథములలో మేలుబంతులై కవికీర్తిస్తంభములై, పృధ్వీతలమున నెల్లకడల నాటుకొనియున్నవి. సంయోగాంతనాటక

  1. * ఈపదమున కర్థము దిగువ వ్యక్తీకరించబడును.