పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

97 పాశవప్రేమ

నము చేతనేకదా సునంద ఇందుమతిచే అజుని వరింపజేసింది. శివధనుర్భంగము చేయనేరని వీరుడు సీతను, మత్స్యయంత్రమున లక్ష్యభేదము సేయనేరని వీరుడు ద్రౌపదిని పెండ్లియాడుటకు తగరు. సభయందు రూపవీర్యగుణవర్ణన చేసినంత మాత్రాన కార్యసిద్ధి సమకూరెనా? సుందరీరత్నము లభించినవారు ఏ పోరులేక ఆమె నింటికి గొనిపోవ సాధ్య మాయెనా? స్వయంవరమున నామేచే తిరస్కృతి వడసిన వారెల్ల పెళ్లికొడుకుతో పెనుగులాడేటప్పుడు అతడు వారి నందరిని జయింపవలయును, లేకుంటే ఆమె యతనికి దక్కదు. ఈగెల్పు అసాధారణకార్యము.

స్వయంవరమున జయము పొందినవారి గుణములను వర్ణించుటేకాక ఓడినవారి మొగము లెట్లు చిన్నవోవు చుండెనో, వా రెట్లు లజ్జాభిభూతులగుచుండిరో, అదికూడా ఆర్యకవులు వర్ణించుచుండిరి. స్వయంవరముల యందు వివాహమే ముఖ్యవిషయముకాదు, వీరత్వముకూడా పరీక్షింపబడుచుండెను. కావున అవి పరాక్రమనికషపాషాణములని యెంచదగును. ఈవర్ణనములు చదువువారి చిత్తములు అందలి వీరరౌద్రరసములచే నాకర్షింపడును, కాని ఇంద్రియ లాలసయు, కామానురాగమును వారి కనుభూతములు కావు.

ఆర్యకవులు కామానురాగమునకును నిసర్గప్రేమకును గల తారతమ్యమును నిర్ణయించి మొదటిదానియందలి